Browse By

Monthly Archives: ఆగస్టు 2016

No Thumbnail

పెరిగిన రెనాల్ట్‌ అమ్మకాలు

న్యూదిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్‌ ఇండియా అమ్మకాల్లో వృద్ధిని సాధించినట్లు తెలిపింది. ముగిసిన జులైలో 11,968 కార్లను విక్రయించినట్లు తెలిపింది. గతేడాది ఇదే నెలలో కేవలం 1,686 కార్లను మాత్రమే విక్రయించినట్లు పేర్కొంది.ఇక ఈ ఏడాది జనవరి నుంచి జులై మధ్య కాలంలో ఏకంగా 73,863 కార్లు అమ్ముడుపోగా, గతేడాది ఇదే కాలంలో 25,032 యూనిట్లను మాత్రమే విక్రయించినట్లు కంపెనీ

No Thumbnail

జైట్లీతో సుజనా, సీఎం రమేశ్‌ భేటీ

న్యూదిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి అరుణ్‌జైట్లీతో కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేశ్‌ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ఆర్థిక సాయంపై ఆయనతో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం సుజనా ప్రయత్నిస్తున్నారు. ప్రధాని కార్యాలయ సిబ్బందిని స్వయంగా ఆయనే సంప్రదించినట్లు సమాచారం. ప్రధానితో సమావేశం కోసం సుజనా సమయం కోరినట్లు తెలిసింది.

No Thumbnail

భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వారికి తగిన గుణపాఠం

దిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వారికి తగిన గుణపాఠం చెప్పాలంటూ కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో పెను దుమారం రేగింది. పారికర్‌ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. రక్షణ మంత్రి అభద్రతాభావాన్ని కలిగిస్తున్నారని.. అలా వ్యాఖ్యలు చేయడం సరికాదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. మహారాష్ట్ర పుణెలో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న పారికర్‌..