Browse By

No Thumbnail

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు

డిసెంబర్‌ 2న స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలకు నోటిఫికేషన్‌ నేటి నుంచి ఎన్నికల కోడ్‌ మొదలవుతోంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ఖరారు చేయడంతో జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలవుతోంది. స్థానిక సంస్థల కోటాలో జిల్లాలో గతంలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఉండగా, రాష్ట్రం ఏర్పాటు తర్వాత సర్దుబాటులో మరో స్థానం అదనంగా చేకూరింది. దీంతో

No Thumbnail

రెండు మూడు రోజుల్లో నగరానికి గోదావరి నీరు

గోదావరి ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది నగరానికి గోదావరి నీళ్లు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఘనపూర్ వద్ద ట్రయల్ రన్ పనులను అధికారులు పర్యవేక్షించారు. రెండు మూడు రోజుల్లో నగరానికి గోదావరి నీరు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. జంటనగరాల ప్రజల దాహార్తిని తీర్చే గోదావరి ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది. గోదావరి జలాలను యుద్ధప్రాతిపదికన తరలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత

No Thumbnail

భారతీయుడిగా గర్విస్తున్నా: అమీర్ ఖాన్ వివరణ

దేశం విడిచి వెళ్లను… తన వ్యాఖ్యలను వక్రీకరించారు. ముంబై: దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తూ దేశం విడిచి వెళ్దామని తన భార్య ఆందోళనపడిందని వ్యాఖ్యానించిన అమీర్ ఖాన్ వివరణ ఇచ్చారు. ప్రపంచం నలుమూలల నుంచి అంతా విరుచుకుపడటంతో అమీర్ ఖాన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. తాను దేశం విడిచి వెళ్లబోనన్నారు. భారతీయుడిగా గర్విస్తున్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు.