Browse By

Category Archives: ఆంధ్ర ప్రదేష్

361 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో 361 పోస్టులకు శనివారం రాత్రి ఆరు నోటిఫికేషన్లు జారీచేసింది. వివిధ విభాగాల్లోని ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను అభ్యర్థుల నుంచి ఆహ్వానించింది. జనవరి 23వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి సాయి వివరించారు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ బయోడేటా సమాచారాన్ని వన్‌టైమ్ ప్రొఫైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ఫస్ట్

హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానం దక్కించుకుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మొదటి ర్యాంకులో నిలిచింది.  ఈమేరకు వరల్డ్ బ్యాంకు, కేంద్ర వాణిజ్యశాఖ కలిసి రూపొందించిన ర్యాంకింగ్ జాబితాను ఇవాళ విడుదల చేశారు.  సులభతర వాణిజ్య విధానంలో 98.78 స్కోర్‌తో తెలంగాణ, ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో గుజరాత్, నాలుగో స్థానంలో ఛత్తీస్‌గఢ్ నిలిచాయి.

విశాఖపట్నంలో బ్రిక్స్ సమావేశం

విశాఖపట్నంలో బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా (బ్రిక్స్) దేశాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఐదు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. దేశ జీడీపీలో 65 శాతం పట్టణాల నుంచే వస్తుంది. బ్రెజిల్‌లో 84 శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. జి-20లోని 5 బ్రిక్స్ దేశాలు చాలా

కేసీఆర్ ఉద్యమం వల్లే తెలంగాణ: వైఎస్ జగన్

నమస్తే హైదరాబాద్: ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. శాసనసభ సమావేశాల రెండోరోజున శుక్రవారం సభ ప్రారంభంకాగానే ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలంటూ స్పీకర్ పోడియాన్ని ప్రతిపక్ష వైసీపీ సభ్యులు చుట్టుముట్టి సభాకార్యక్రమాలను అడ్డుకొన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎంత వారించినా చర్చ జరుపాల్సిందేనని పట్టుపట్టారు. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత ప్రత్యేకహోదాపై చర్చ ఉంటుందని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి యనమల

ప్రత్యేక హోదా లేదు ప్యాకేజీయే!

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలోని ఏ రాష్ర్టానికీ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. దాని స్థానంలో వెలుపలినుంచి మద్దతు అందించే ప్రాజెక్టుల ద్వారా ప్రత్యేక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలన్నీ దీని ద్వారా నెరవేరుతాయని