Browse By

అవసరాలకు సరిపడేంతగా ఇసుక సరఫరా చేస్తాం: మంత్రి కెటి రామారావు

అవసరాలకు సరిపడేంతగా ఇసుక సరఫరా చేస్తాం- పరిశ్రమలు, గనుల శాఖ మంత్రి కెటి రామారావు

 అక్రమ డంపులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నా అధికారులకు అదేశం

 దళారులపై క్రిమినల్ కేసులు, భారీ జరిమానాలకు విధిస్తామన్న మంత్రి

 ఇసుక డంపులు కనిపిస్తే TSMCD కి చెందిన 040 23323150, 9000405705 నంబర్లకు ఫోన్ చేసి తెలుపాలన్న మంత్రి

రాష్ర్టంలోని నిర్మాణ అవసరాలకు సరిపడేంతగా ఇసుక సరఫరా చేస్తామని పరిశ్రమలు, గనుల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పరేషన్ ఈ వర్షాకాలంలో అవసరమైన ఇసుక పరిమాణాలను ప్రజలకు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతూ ఇసుక తవ్వకాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రి కెటి రామారావు టియస్ యండిసి అధికారులతో మాట్లాడారు. వర్షాకాలం మెత్తం ఎటువంటి కొరత లేకుండా పూర్తిస్థాయిలో పరిమాణాలు (స్టాక్) వున్నాయని మంత్రికి అధికారులు తెలియజేశారు. 

         
అయితే కొంతమంది దళారులు కృత్రిమ ఇసుక కొరతను సృష్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్న మంత్రి ఇట్లాంటి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల చుట్టుప్రక్కల ఇసుక డంపులు ఏర్పాటు చేస్తున్నారని, ఇసుక గ్యాంగులు గా తయారై ఇసుక రేటును అమాంతం పెంచి ఇసుక కొరత వున్నట్లు, లేని పరిస్ధితిని తయారు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడ్తామని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వము సీరియస్ గా తీసుకుంటుందని, చట్ట బద్దంగా లేని డంపులను సీజ్ చేస్తామన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలించే వాహానాలను వేంటనే సీజ్ చేస్తామన్నారు. మినరల్ డీలర్ లైసెన్స్ లేకూండా ఇసుక స్టాకులు వున్నట్లయితే సీజ్ చేసి చట్టప్రకారము జరిమానాలు తప్పవని మంత్రి తెలిపారు. 

తమ నిర్మాణ మరియు ఇతర అవసరాలకు కావలసిన ఇసుకను TSMDC ఆన్ లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ మేరకు (www.sand.telangana.gov.in ) ను ఉపయోగించుకోవాలన్నారు. ఇసుక సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా మరియు ఎక్కడైనా చట్టబద్దంగా లేని ఇసుక డంపులు కనిపిస్తే TSMCD కి చెందిన 040 23323150, 9000405705 నంబర్లకు ఫోన్ చేసి తెలుపాలన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail