Browse By

అమిత్‌ షా చెప్పినవి అసత్యాలు: ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

తెలంగాణ పర్యటన సందర్భంగానల్గొండ జిల్లాలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పచ్చి అబద్దాలు, అసత్యాలు చెప్పారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. అమిత్‌ షా రాజకీయ ప్రేరేపితమైన వ్యాఖ్యలు చేశారు. తప్పులు ప్రచారం చేసినందుకు అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. 


చిల్లర రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. మేం మౌనంగా ఉంటే అంతా నిజమే అనుకుంటారు. రూలింగ్‌లో ఉన్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడవలసిన మాటలేనా ఇవి అని ఘాటుగా స్పందించారు. నేను చెప్పేది తప్పయితే.. అమిత్‌ షా రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. అమిత్‌ షా.. భ్రమిత్‌షా.. వచ్చి నల్గొండ కూడలిలో పాములాట పెట్టి చెబితే కేసీఆర్‌ భయపడతాడా అని ప్రశ్నించారు. నన్ను తిడితే పట్టించుకోను.. కానీ తెలంగాణను కించ పరిచేవిధంగా, ప్రగతి కుంటుపడే విధంగా మాట్లాడితే సహించను అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ కాదు.. పీజేపీ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రానికి రావాల్సిన మొత్తం ఇవ్వాల్సిందే. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగానే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చాయి తప్ప ఒక్క రూపాయి కూడా అదనంగా రాలేదని గణాంకాలతో సహా సీఎం వివరించారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail