Browse By

అమెరికాలో మంత్రి కెటి రామారావు పర్యటన ప్రారంభం

తెలంగాణ ఏన్నారైల సమావేశంలో పాల్గోన్న మంత్రి
రాష్ర్ట అభివృద్దిలో తెలంగాణ ఏన్నారైలు కలిసి రావాలని కోరిన మంత్రి

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు వివరించిన మంత్రి

ఏన్నారైలకు అన్ని రకాల సహాయ సహకాలుంటాయని హమీ

ఎన్నారైలతో ముఖాముఖి సందర్భంగా పలు ప్రశ్నలకు మంత్రి సమాదానం


తెలంగాణ రాష్ర్ట అభివృద్దిలో తెలంగాణ ఏన్నారైలు కలిసి రావాలని ఏన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కెటి రామారావు కోరారు. ఈ రోజు అమెరికాలో తన పర్యటన ప్రారంభించిన మంత్రి కాలిఫోర్నియా రాష్ర్ట్లంలోని శాక్రమెంటో పట్టణంలో తెలంగాణ ఎన్నారైలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను మంత్రి ఎన్నారైలకు తన ప్రసంగంలో వివరించారు. తర్వతా జరిగిన ముఖాముఖి సందర్భంగా పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతాయని, సంక్షేమం, అభివృద్ది రంగాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కెసియార్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టం ప్రగతిశీల, పురోగమన శీల రాష్ర్టంగా మారిందని, ఈ మేరకు ఇతర రాష్ర్టాలు, నీతి అయోగ్ వంటి సంస్దలు పలు సందర్భాల్లో మెచ్చుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. మరోవైపు విద్యుత్తు, సాగునీటి రంగాల్లో దీర్ఘకాలిక ప్రాజెక్టులు చేపట్టామని, ఇవన్నీ పూర్తయితే బంగారు తెలంగాణ సాద్యం ఖచ్చితంగా అవుతుందన్నారు. తెలంగాణ సాద్యం కాదని ప్రచారాలు చేసినప్పుడు, మెక్కవోని దీక్షతో రాష్ట్రం సాధించిన తీరుగానే, తెలంగాణ ప్రజల అకాంక్షల మేరకు, వారి అశీర్వాదాలతో ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ సాధిస్తారన్నారు. తెలంగాణ రాష్ర్టా సాధనకు సహాకరించిన ఏన్నారైలు, సాధించుకున్న సొంత రాష్ర్ట అభివృద్దిలో అదే స్పూర్తితో భాగస్వాములు కావాలన్నారు. రాష్ర్టంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలతో ఏం చేయాలో పాలుపోని ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్షలు చేస్తున్నాయని, అలాంటి విమర్శలకు ప్రజలే సమాధానం చేప్తున్నారని మంత్రి తెలిపారు. అరవై ఏళ్లపాలు పాలించిన ప్రతిపక్షాలు సాధించలేనిది, కేవలం తమ ప్రభుత్వం మూడేళ్లలో సాధించిందని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలను అడిగి తెసుకోవాలని మంత్రి ఏన్నారైలను కోరారు. ఈ సందర్భంగా మంత్రి కరెంటు కోతలు, నూతన గురుకులాలు, వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాకాలు, పరిశ్రమలకు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా చేపట్టిన కార్యక్రమాలను మంత్రి తెలియజేశారు. 

తెలంగాణ అభివృద్దితో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో కలిసి రావాలని, ఇందుకోసం తాము పుట్టిన గ్రామాల అవసరాల మేరకు కొంతైనా సహకారాన్ని తిరిగి అందించాలని కోరారు. ముఖ్యంగా కేంద్రం ప్రవేశ పెట్టిన ఇండియా డెవలప్ ఫండ్ ద్వారా ప్రవాసులు ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా అభివృద్ది కార్యక్రమాలకే పోతుందన్నారు. ఈ మద్య కాలంలో నల్గోండ, సూర్యపేట్ జిల్లాల్లో పలువురు ఏన్నారైలు ఈ మార్గంతో తమ గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలను మంత్రి ఉదహరించారు. గ్రామాల్లోని పాఠశాలలు, ప్రాథమిక అరోగ్యకేంద్రాలు, లైబ్రరీల అభివృద్ది చేసేందుకు ఏన్నారైలు ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. తాను పురపాలక శాఖా మంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ది పట్ల చేస్తున్న కృషిని వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటి పరిశ్రమ సాధిస్తున్న ప్రగతిని విరించిన మంత్రి, ఐటి రంగంలోని డాటా అనలిటిక్స్, డాటా సెక్యూరీటి వంటి నూతన రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చేస్తున్నప్రయత్నాలను తెలిపారు. ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ (యంఏల్యే) చొరవతో పలువురు ఏన్నారైలు కలసి ఖమ్మంతో ఐటి పరిశ్రమ ఎర్పాటుకు ముందుకు వచ్చారని, ఇలాంటి ప్రయత్నానికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఐటి టవర్ నిర్మాణ చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇలా రెండవ తరగతి నగరాలకు ఐటి విస్తరణలో ప్రవాస భారతీయులు చొరవ చూపాలన్నారు. 


శాక్రమెంటోలో జరిగిన ఈ సమావేశంలో పట్టణంలోని ఏన్నారైలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఏన్నారైలు హజరయ్యారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail