Browse By

ఓయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

 జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్రపతికార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం ప్రారంభించారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఓయూ చేరుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఓయూ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు మంత్రులు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఓయూ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail