Browse By

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఘనంగా ఈస్టర్ అన్నదాన కార్యక్రమం

న్యూ జెర్సీ, ఏప్రిల్ 16 , 2017 : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఆదివారం రోజు ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని న్యూ జెర్సీ లోని మౌంట్ హాలీ గ్రామం లో ఓట్స్ డౌన్ టౌన్ పబ్ అండ్ గ్రిల్ లో 400 మంది పేద మరియు నిర్వాస రహిత అమెరికన్లకు చక్కటి విందు భోజనం ను ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమ ముఖ్య దాత, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు అఫ్ డైరెక్టర్, ఓట్స్ డౌన్ టౌన్ గ్రిల్ అధిపతి శ్రీ డా” రామిరెడ్డి మల్లాది మాట్లాడుతూ ఈస్టర్ పండుగ రోజున ఇంత పెద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించటానికి, అమెరికన్లకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించిన దేవుడికి, తల్లి తండ్రులకు, కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) చేస్తున్న గొప్ప సేవ కార్యక్రమాలు అని, ఇందుకు టాటా కార్యవర్గ సభ్యులకు మరియు ఈ కార్యక్రమం లో పాల్గొన్న సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియ చేశారు.


తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) అడ్వైసరి చైర్మన్, వ్యాపారవేత్త శ్రీ డా” పైళ్ల మల్లారెడ్డి గారు మాట్లాడుతూ, ” అన్నదాత సుఖీభవ” అన్నిదానాలలో కెల్ల గొప్పదానం అన్నదానమని, ఈస్టర్ పండుగ రోజున టాటా నిర్వహిస్తున్న కార్యక్రమాలు చాల గొప్పవని ఆయన కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు టాటా ముందు ముందు చాల నిర్వహిస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యూ జెర్సీ, ఫిలడెల్ఫియా మరియు డెలావేర్ టాటా సభ్యులని ఆయన అభినందించారు.


తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలుగు వారికి దాన గుణం చాల ఎక్కువ అని, వారెప్పుడు ఎదుటివారికి సహాయం చేయటం లో ముందుంటారని, ఈ సంస్థ లో పని చేసే ప్రతి వ్యక్తి మంచి మనసు ఉన్నవారిని తెలియజేసారు. ఈ సందర్భంగా, కార్యక్రమంలో పాల్గొన్న న్యూ జెర్సీ, ఫిలడెల్ఫియా మరియు డెలావేర్ సభ్యులను అభినందించారు.


తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ మహేందర్ ముసుకు గారు మాట్లాడుతూ, అమెరికా అంతటా ఎన్నో సేవలను టాటా అందిస్తుందని, సేవలు పొందిన ప్రతి ఒక్కరు అభినందనలు తెలువుతుంటే చాలా ఆనందంగా ఉంటుందని అన్నారు. టాటా కార్యవర్గ సభ్యులు ఎక్కువగా యువకులని, వీరు తలుచుకుంటేనే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మరెన్నో నిర్వహించాలని పిలుపునిచ్చారు.

బీకాన్ అఫ్ హోప్ సేవా సంస్థ, న్యూ జెర్సీ డైరెక్టర్ డార్లిం ఈస్టర్ లంచ్ డొనేషన్ కు టాటా తమను ఎంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. టాటా చేస్తున్న మానవ సేవలు మరువలేనివని, ఏదో చేస్తున్నాం అన్నట్లు కాకుండా ఎంతో గొప్పగా చేస్తారని ఆమె అభినందించారు. అమెరికన్లు అందరూ తెలుగు వారు ఎంత మంచివారో ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలుసుకుంటారని చెప్పారు. 150 కుటుంబాలు ఫ్రీ ఈస్టర్ లంచ్ కి నమోదు చేసుకున్నారని వారికి మంచి విందు లభించిందని తెలియజేసారు.

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ముఖ్య సలహాదారులు డా” హరినాథ్ పొలిచెర్ల , డా” మోహన్ పట్లోళ్ల డా” విజయపాల్ రెడ్డి, డా” సుధాకర్ విడియాలా మరియు టాటా ఎగ్జిక్యూటివ్ వర్గం శ్రీనివాస్ రెడ్డి అనుగు, భరత్ మదాడి, విక్రమ్ జంగం, మహేష్ ఆదిభట్ల, అనిల్ ఎర్రెబల్లి, ఫణి భూషణ్ అందరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యమంలో న్యూ జెర్సీ బోర్డు అఫ్ డైరెక్టర్ డా” రామిరెడ్డి మల్లాది, ఫిలడెల్ఫియా బోర్డు అఫ్ డైరెక్టర్ సురేష్ వెంకన్నగారి, రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ ధనరాజ్ శేరి, శ్రీనివాస్ రెడ్డి పాతూరి, ప్రసాద్ కునారపు, వేణు ఏనుగుల, టాటా నేషనల్ లాంగ్వేజెస్ చైర్ నరసింహ రెడ్డి దొంతిరెడ్డి, మూడు రాష్ట్రాలు న్యూ జెర్సీ, ఫిలడెల్ఫియా మరియు డెలావేర్ కార్యవర్గ సభ్యులు డా” స్వామి బొడిగె, శ్రీమతి కళావతి, రమణ రెడ్డి కొత్త, యాది పాత్కుల, అమర్ వెల్మాలా, వంశీ గుళ్ళపల్లి, ప్రశాంత్ వేముగంటి, సత్య యాలాల, వెంకట్ ముక్కామల, విజయ్ వైద్యుల సుధీర్ మిర్యాల, బస్వారాజ్ తమ్మాలి పృద్వి రెడ్డి, బిందు మాదిరాజు రాజలక్ష్మి పాతూరి, సింధు యాలాల, శ్యామ్ బోనగిరి, గంగాధర్ ఉప్పల, ప్రశాంత్ చింతవర్ , శశి కసిరా కిరణ్ గూడూరు సతీష్ సుంకనపల్లి, సతీష్ మేకల, శ్రీనివాస్ దూళిపాళ్ల ,రవి పెద్ది, బేబీ సహస్ర, బేబీ యోషితః పాల్గొన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail