Browse By

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో  కె.సి.ఆర్ కిట్స్ పంపిణి

​రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు  ఈ నెల 10న నిర్వహించే కలెక్టర్ల సమావేశానికి తమ జిల్లాలకు సంబంధించి తగు సమాచారంతో రావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.                          


శుక్రవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ చందా , రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బి.ఆర్. మీనా, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బి.పి.ఆచార్య, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమీషనర్ నీతూ ప్రసాద్ , వైద్యశాఖ కమీషనర్ శ్రీమతి కరుణ, సెర్ప్ సి.ఇ.ఒ. పౌసమిబసు, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి యోగితారాణా తదితరులు పాల్గొన్నారు.


​ఈ సమావేశంలో నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసెకరణ, జిల్లాలలో చేపల పెంపకం , కె.సి.ఆర్ కిట్స్ పంపిణి, గొర్రెల పంపిణి, సాదాబైనామాల క్రమబద్దికరణ, మిషన్ భగీరథ, ఒంటరి మహిళాలకు పెన్షన్లు, మంచి నీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు.


​ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాదాన్యత ఇస్తున్నాదని, భూసేకరణ సకాలంలో జరగకపొతే వ్యయం పెరిగే అవకాశ మున్నందున కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద వహించి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిర్థిషకాలపరిమితి విధించుకొని భూసేకరణ పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్టానికి త్వరలోనే ఆమోదం లభిస్తుందని, ఈ లోగా 2013 చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి గారు జిల్లాలలో సాగు నీటి ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని సమీక్షిస్తారని సి.యస్ తెలిపారు.
​చేపల పెంపకానికి సంబంధించి సి.యస్ మాట్లాడుతూ ఇప్పటికే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లల ద్వారా వచ్చే చేపల ఉత్పత్తి, ఉత్పాదకత లతో పాటు వచ్చే సంవత్సరానికి అవసరమైన చేప పిల్లల వివరాలతో రావాలన్నారు. మత్స్య సహకార సంఘాలకు మార్కెటింగ్ వ్యూహన్ని రూపొందించాలన్నారు.
​తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రారంభించే కె.సి.ఆర్ కిట్స్ పంపిణి గురించి ప్రణాళిక రూపొందించు కోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. PHC, ఎరియా ఆసుపత్రులలో అవసరమైన సౌకర్యాలను ఏర్పరచుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఈ నెల 25 లోగా కె.సి.ఆర్ కిట్స్ జిల్లా స్టోర్ లకు చేరుకుంటాయని , ప్రతి ఆసుపత్రికి ఇవి చేరేలా చూడాలన్నారు. గర్భిణి స్త్రీలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహానికి సంబంధించి సాప్ట్ వేర్ రూపొందింస్తున్నామని సి.యస్ తెలిపారు.
​గొర్రెల పంపిణికి సంబంధించి మాట్లాడుతూ గోల్ల , కురుమ, యాదవ కులాలకు చెంది 18 సంవత్సరాలు నిండి, గొర్రెల పెంపకానికి ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఒక యూనిట్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతమున్న సోసైటీ లలో కొత్తగా సభ్యుల నమోదు, కొత్త సోసైటీల ఏర్పాటుకు మిషన్ మోడ్ తరహలో 15 రోజుల్లో గ్రామాలలో సర్వేను పూర్తి చేయాలన్నారు. గొర్రెల పెంపకానికి ఇష్టపడే గొల్ల, కురుమ, యాదవ కులాలకు సంబంధించి ప్రతికుటుంబం లబ్దిపోందేలా చుడాలన్నారు. ఈ సంవత్సరం 2 లక్షల యూనిట్లు వచ్చే సంవత్సరం 2 లక్షల యూనిట్లు పంపిణి ఉంటుందన్నారు. గొర్రెలకు అవసరమైన మేతను పెంచడం కోసం అటవీ భూములను గుర్తించాలన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా , పారదర్శకంగా ఈ పథకం అమల య్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. వర్షాలు ప్రారంభమయ్యాక జూన్ 20 లోగా గొర్రెల పంపిణికి చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు. రెండు, మూడు మండలాల కొక శాండిని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క లబ్దిదారుని ఆధార్ నెంబర్ , బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలన్నారు.
​సాదాబైనామాల క్రమబద్దికరణకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తారని తగు వివరాలతో రావాలన్నారు.
మిషన్ భగీరథకు సంబంధించి స్థానిక కాంటాక్టర్లకు ఇంట్రా విలేజ్ పనుల అప్పగింతతో పాటు , జిల్లాల్లో జరుగుతున్న పనుల పురొగతిని ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తారని, ప్రయివేటు వ్యక్తుల భూములలో పైపులైన్లు వేసే పనులను వేగవంతం చేయడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు.
ఒంటరి మహిళలకు పెన్షన్లు , మంచినీటి పరిస్థితి తదితర అంశాలను చర్చించారు.​

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail