Browse By

డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి: మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో పేదల కోసం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక అని, లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టాలని ప్రజలకు మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన మహ బూబ్‌ నగర్‌ జిల్లా దివిటిపల్లిలో, నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో, వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లా డారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇప్పిస్తామని వచ్చే బ్రోకర్లను నమ్మవద్దన్నారు. రూ.18 వేల కోట్లతో 2.65 లక్షల ఇళ్లను నిర్మిస్తు న్నామని, దేశంలో ఇంత పెద్ద ప్రాజెక్టును చేప ట్టిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్క రేనని పేర్కొన్నారు.

ఇళ్లు, భూమితో కలుపు కొని ఒక్క లబ్ధిదా రునికి రూ.20 లక్ష వరకు ఖర్చు అవుతుం దన్నారు. ఎలాంటి బ్యాంకు రుణాలు లేకుండా పూర్తిగా ప్రభుత్వ ఖర్చు తోనే నిర్మి స్తున్నట్లు కేటీఆర్‌ వివరించారు. ప్రతి పేద వాడికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఇంత పెద్ద ప్రాజె క్టుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తెలంగాణ వస్తే ఏం వస్తదని కొంతమంది అవహేళన చేసిన వారికి ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను చూపించాలని సూచించారు. డబుల్‌పై ప్రతి పక్ష పార్టీలు అన వసరంగా బురద చల్లుతున్నాయని ఆరోపిం చారు. 60 ఏళ్ల గబ్బును పారదోలడానికి మూడేళ్లు సరిపోదనన్నారు. రూ.51 వేలు ఉన్న షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకాన్ని విలువను రూ.75 వేలకు పెంచామన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అవసరాలు తెలిసిన నేతగా సీఎం కేసీఆర్‌ ఆడపడుచులకు మేన మామగా, రైతులకు పెద్ద న్నగా అవసరాలు ఎరిగి పనులు చేస్తున్నారని అన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail