Browse By

సింగ‌రేణి కార్మికుల‌ను ద‌గా చేసిన‌ కేసిఆర్: ఉత్త‌మ్

సింగ‌రేణి కార్మికుల‌ను ద‌గా చేసిన‌ కేసిఆర్ ః 
వారస‌త్వ ఉద్యోగాల పేరుతో మోసం చేశాడు…. 

ఒక్క హామీ అమ‌లు చేయ‌లేదు ః టిపిసిసి అధ్యక్షులు ఉత్త‌మ్ 

సింగ‌రేణి స‌మ్మెకు కార్మిక ఐక్య సంఘ‌ట‌న నోటీసు ః 

ఐఎన్‌టియుసి జాతీయ అధ్య‌క్షులు సంజీవ‌రెడ్డి


తాను అధికారంలోకి రాగానే సింగ‌రేణి కార్మికుల‌కు వార‌స‌త్వ ఉద్యోగాలు ఇస్తాన‌ని చెప్పి మూడేళ్ళ‌కు ఒక త‌ప్ప‌డు జిజో ఇచ్చి సింగ‌రేణి కార్మికుల‌కు మోసం చేసిన ముఖ్య‌మంత్రి కేసిఆర్ త‌రువాత త‌న వారిచేత‌నే కేసులు ఏయించి వాటిని ఆపించి తిరిగి త‌మ‌పై అప‌వాదు మోపుతున్నార‌ని, కేసిఆర్ వార‌స‌త్వ ఉద్యోగాల కోసం ప్ర‌య‌త్నాలు చేసే్త తాము పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని, కార్మికుల‌కు న్యాయం చేసేందుకు కేసిఆర్ వెంట‌నే చిత్త‌శుద్దితో ప‌ని చేయాల‌ని టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్ర‌వారం నాడు గాంధీభ‌వ‌న్‌లో టిపిసిసి సింగ‌రేణి స‌మ‌న్వ‌య క‌మిటీ సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఉత్త‌మ్‌కుమార్ రెడ్డితోపాటు ఐఎన్‌టియుసి జాతీయ అధ్య‌క్షులు, సిడ‌బ్లు.సి స‌భ్యులు, ఎం.పి జి. సంజీవ‌రెడ్డి, ఎఐసిసి కార్య‌ద‌ర్శి రాంచంద్ర కుంటియా, క‌మిటీ చైర్మ‌న్ మాజీ విప్ గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి, స‌భ్యులు మాజీ కేంద్ర మంత్రి బ‌ల‌రాం నాయ‌క్‌, మాజీ మంత్రి శ్రీ‌ద‌ర్ బాబు, క‌మిటీ స‌భ్యులు, డిసిసి అధ్య‌క్షులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స‌మావేశంలో సింగ‌రేణి కార్మికుల‌కు గ‌త ఎన్నిక‌ల ముందు కేసిఆర్ ఇచ్చిన హామీలు, వార‌స‌త్వ ఉద్యోగాల విషయంలో కార్మికుల‌కు చేసిన ద్రోహం , కాంట్రాక్టు ఉద్యోగుల ప‌ర్మెనెంట్ త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చంచారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన విలేక‌రుల‌స‌మావేశంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్ల‌డుతూ ఎన్నిక‌ల ముందు కేసిఆర్ సింగ‌రేణి కార్మికుల‌కు ఇచ్చిన ఒక్క హామీని నిల‌బెట్టుకోలేద‌ని, మూడేళ్ళ‌యినా ఇంత‌వ‌ర‌కు హామీలు అమ‌లు జ‌ర‌గలేద‌ని ఇది సింగ‌రేణి కార్మికుల‌ను ద్రోహం చేయ‌డ‌మేన‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఎన్నిక‌ల ముందు వార‌స‌త్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చాక తొలి సంత‌కం ఆ ఫైల్ మీద చేస్తాన‌ని చెప్పిన కేసిఆర్‌, ద్రోహ పూరితంగా ఒక జి.ఓ ఇచ్చార‌ని ఈ జిఓ చెల్ల‌ద‌ని తెలిసి కూడా రాజ్యంగ విరుద్దంగా ఇచ్చిన జిఓను కోర్టు కొట్టేసింద‌ని ఇది ఆయ‌నకు ముందే తెలిసినా ఎలాంటి ప్రత్యామ్నాయ చ‌ర్య‌లు తీసుకోలేద‌ని, దీంతో దాదాపు 16 వేల మంది వార‌స‌త్వ ఉద్ద్యోగాల కోసం ద‌రఖాస్తు చేసుకున్న వారు తీవ్ర‌మైన నిరాశకు గుర‌య్యార‌ని తిరిగి ఈ త‌ప్పును కాంగ్రెస్‌పై మోపి రాజ‌కీయ ల‌బ్డి పొందేందుకు కుట్ర‌లు చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కేసిఆర్‌కు చిత్త‌శుద్ది ఉంటే వార‌స‌త్వ ఉద్యోగాల విష‌యంలో ఆయ‌న ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల‌ని అందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ఎన్నిక‌ల ముందు సింగ‌రేణిలో కాంట్రాక్టు కార్మికుల‌ను ప‌ర్మెనెంట్ చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, అసెంబ్లీల‌లో ఒక్క కాంట్రాక్టు కార్మికుడు కూడా లేర‌ని అబద్దం చెప్పార‌ని సింగ‌రేణిలో 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులున్నార‌ని ఆయ‌న వివ‌రించారు.

ఇక‌పోతే తెలంగాణ ఉద్య‌మంలో స‌క‌ల జ‌నులు స‌మ్మె స‌మ‌యంలో 60 వేల మంది కార్మికులు 35 రోజుల పాటు స‌మ్మెలో పాల్గొంటే స‌మ్మె వేత‌నం ఇస్తాన‌ని చెప్పిన కేసిఆర్ ఉద్యోగ విర‌మ‌ణ చేసిన వారికి వేత‌నాలు ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌తి ఒక్క కార్మిక కుటుంబానికి స్వంత ప‌క్కా ఇల్లు క‌ట్టిస్తామ‌ని చెప్పిన కేసిఆర్ 

ఒక్క ఇల్లు క‌ట్ట‌లేద‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల ముందు ఒపెన్ కాస్టులు బొంద‌ల‌గ‌డ్డ‌లాగ ఉంటాయ‌ని, అధికారంలోకి రాగానే ఒపెన్ కాస్టులు లేకుండా చేస్తాన‌ని చెప్పి ఇప్ప‌డు 16 ఒపెన్ కాస్టుల‌కు అనుమ‌తి ఇచ్చార‌ని విమ‌ర్శించారు. సింగ‌రేణిలో అత్యుధినిక స‌దుపాయాల‌తో ఆసుప‌త్రి నిర్మిస్తామ‌ని, సింగ‌రేణి కార్మికుల కోసం ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల ఏర్పాటు చేస్తామ‌ని చెప్పి ఒక్క హామీ కూడా అమ‌లు చేయ‌లేదని విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలోనే సింగ‌రేణి ప‌రిధిలో 5 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాలు, 24 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో కార్మికుల పక్షాన పోరాటాలు చేసేందుకు గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి నేతృత్వంలో ఒక స‌మ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని అన్నారు. ఈ క‌మిటీ అటు కార్మికుల ప‌క్షాన‌, ఇటు ఉపాధి హామీ చ‌ట్టం కూలీలు, నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల ప‌క్షాన పోరాటాలు చేస్తార‌ని వివ‌రించారు. ఇక‌పోతే భ‌విష్య‌త్‌లో కార్మిక సమ‌స్య‌ల‌పైన ఐఎన్‌టియుసితో క‌లిసి ఉద్య‌మాలు చేస్తామ‌ని తెలంగాణ వ్యాప్తంగా పోరాటాలు కొన‌సాగించి కార్మిక ప‌క్షాన నిల‌బ‌డుతామ‌ని ఆయ‌న అన్నారు. 

ఉపాధి కూలీల కోసం … కాగా ఉపాధి హామీ కూలీల కోసం కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుంద‌ని ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఐఎన్‌టియుసి ఇప్ప‌టికే కోటి మంది ఉపాధి హామీ కూలీల స‌మాచారం సేక‌రించింద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 4 నెల‌లుగా వారికి కూలీ డ‌బ్బులు ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. చ‌ట్టం ప్ర‌కారం వారికి ఎలాంటి సౌక‌ర్యం క‌ల్పించ‌లేద‌ని ఎండాకాలంలో వారికి టెంట్లు, మంచినీరు సౌక‌ర్యం, అత్య‌వ‌స‌ర వైద్యం లాంటివి ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

సింగ‌రేణిలో ఐక్య సంఘ‌ట‌న ఆధ్వ‌ర్యంలో సమ్మె ః 

17న సమ్మెకు నోటిసు ః సంజీవ‌రెడ్డి

సింగ‌రేణిలో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించేందుకు కార్మిక సంఘాల ఐక్య సంఘ‌ట‌న నేతృత్వంలో పోరాటం చేయ‌నున్నామ‌ని ఐఎన్‌టియుసి అధ్య‌క్షులు సంజీవ‌రెడ్డి వివ‌రించారు. సింగ‌రేణిలో టిఆర్ ఎస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెర‌వేర‌లేద‌ని ఈ అంశాల‌పై ప‌లు వామ‌ప‌క్ష, ఇత‌ర కార్మిక సంంఘాల‌తో క‌లిసి ఐక్య కార్మిక సంఘ‌ట‌న‌గా ఏర్పడి స‌మ్మెకు పిలుపునివ్వ‌నున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. కాంగ్రెస్ పార్టీ ఐఎన్‌టియుసికి త‌ల్లి లాంటిద‌ని దేశ‌వ్యాప్తంగా కార్మిక సమ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌బోతున్నామ‌ని అన్నారు. జాతీయ ఉపాధి హామీ చ‌ట్టం ద్వారా కూలీల‌కు రావాల్సిన హ‌క్కుల‌పై పోరాటం చేస్తామ‌ని అన్నారు. 

కార్మిక సంక్షేమ నిధిలో అక్ర‌మాలు ః కుంటియా

దేశ‌వ్యాప్తంగా 40 వేల కోట్ల రూపాయ‌ల కార్మిక సంక్షేమ నిధిలో రెండు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అక్ర‌మాలు చేశాయ‌ని తెలంగాణ‌లో రెండు వేల కోట్ల రూపాయ‌ల నిధిలో కూడా నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని ఎఐసిసి కార్య‌ద‌ర్శి ఆర్‌.సి కుంటియా విమ‌ర్శించారు. కార్మిక సంక్షేమం కోసం చేప‌ట్టాల్సిన నిధుల‌తో వారి సంక్షేమ కార్య‌క్ర‌మాలు కాకుండా ప్ర‌భుత్వ అవ‌స‌రాల కోసం నిధులు వెచ్చించార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇంకా స‌మావేశంలో క‌మిటీ చైర్మ‌న్ గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి కూడా మాట్ల‌డారు. 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail