Browse By

వరంగల్ లో దేశంలోనే పెద్ద కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ త్వరలో శంకుస్థాపన

వరంగల్ లో దేశంలోనే పెద్ద కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ త్వరలో శంకుస్థాపన
• కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు ఏప్రిల్ నెలాఖరులో సిఎం కేసిఆర్ తో శంకుస్థాపన
• భారతదేశంలోనే పెద్ద టెక్స్ టైల్ పార్క్ గా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ప్లానింగ్
• టెక్స్ టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెష్టర్లు సిద్ధంగా ఉన్నారు
• త్వరలోనే ఇన్వెస్టర్ల క్షేత్ర స్థాయి పర్యటన ఏర్పాటు చేస్తాం
• స్థానికులకే ఉపాధి అవకాశాలు..ఉద్యోగాలు
• టెక్స్ టైల్ పార్క్ ఉన్నతోద్యోగాలు కూడా స్థానికులకే ఇవ్వడానికి ప్రత్యేక కోర్సులు
• ఈ విద్యా సంవత్సరం నుంచే పిఎస్ జీ కోర్సును వరంగల్ లో ప్రారంభిస్తాం
• శంకుస్థాపన నాటికి పార్క్ రోడ్డు, ముఖద్వారాల అభివృద్ధి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
• పార్క్ అవసరాలు పూర్తిగా తీర్చేలా ఎస్ ఆర్ఎస్పీ నుంచి నీటి వసతి, ప్రత్యేక సబ్ స్టేషన్
• టెక్స్ టైల్ పార్క్ లో చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు. చేనేత మహిళలకు కూడా ఉపాధి
• చుట్టుపక్కల నియోజక వర్గాలందరికీ కూడా ఉపాధి కల్పించే స్థాయిలో పార్క్ అభివృద్ధి
• దారం నుంచి వస్త్రం వరకు అన్ని టెక్స్ టైల్ పార్క్ లోనే తయారయ్యే విధంగా పార్క్ ఏర్పాటు
• కార్మికులకు రెసిడెన్షియల్ క్వార్టర్స్
• చుక్క కాలుష్యం కూడా బయటకు రాకుండా అత్యధునిక కాలుష్య నివారణ యంత్రం పార్క్ లోనే ఏర్పాటు
• పార్క్ లో భారీ వాహనాలు తిరిగేందుకు 150 ఫీట్ల రోడ్ల అభివృద్ధి
• ముఖ్యమంత్రి కేసిఆర్ శంకుస్థాపన కార్యక్రమానికే ముందే సర్వం సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
• మెగా టెక్స్ టైల్ పార్క్ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, మునిసిల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్, గిరిజన శాఖ మంత్రి చందూలాల్, ఎంపీ దయాకర్, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు

వరంగల్ నగర సుందరీకరణ
• వరంగల్ నగరాన్ని ఏప్రిల్ 27వ తేదీ టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ కోసం సుందరీకరణ చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, మునిసిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు.
• సభ నాటికి నెల రోజుల్లో రోడ్లను అందంగా రూపొందించాలిః
• గ్రీనరీని డెవలప్ చేయాలి
• స్వచ్ఛ వరంగల్ పేరిట 200 నుంచి 300 ఆటో టిప్పర్ వెహికల్స్ ను చెత్త తీయడానికి హైదరాబాద్ లో తిప్పుతున్నట్లు వరంగల్ నగరంలో తిప్పాలి
• ఇంటింటికి రెండు చెత్త బిన్స్ ను అందించాలి. వెంటనే ఐదు లక్షల బిన్స్ పంపిణీ చేయాలి
• పెద్ద ఎత్తున పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా షీ-టాయిలెట్స్ కూడా ఎక్కడికక్కడ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి
• రోడ్లను వెడల్పు చేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలి
• గుర్తించిన, గుర్తించని మురికివాడల జాబితా సిద్ధం చేసి మురికివాడల వారందరికీ న్యాయం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు, పట్టాలు ఇచ్చేందుకు కావల్సిన ప్లాన్స్ రెడీ చెయ్యాలి.
• కార్పోరేషన్ లో ఉన్న ఇంజనీరింగ్, ఇతర ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి
• మాస్టర్ ప్లాన్ పనులు వేగంగా కొనసాగాలి. మాస్టర్ ప్లాన్ లో ట్రాన్సిట్ ఓరియెంటెడ్ గ్రోత్ కారిడార్స్, రేడియల్ రోడ్స్, పార్క్స్, అన్ని అంశాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి
• వరంగల్, జనగాం, మహబూబాబాద్ ఔటర్ రింగ్ రోడ్ల పనులు శరవేగంగా జరపాలి. అక్కడ సమస్యలుంటే స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేసి పరిష్కరించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి.
• కాకతీయ అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ స్వయం సమృద్ధిగా ఉండే విధంగా వరంగల్ నగరానికి నాలుగు వైపుల భూసేకరణ చేపట్టాలి. భవిష్యత్ అవసరాల కోసం ఈ భూమిని వినియోగించే విధంగా ప్లాన్ చేసుకోవాలి.
• నెల రోజుల్లో సాక్షి కార్యాలయం నుంచి మడికొండ వరకున్న రోడ్డు, స్టేషన్ ఘన్ పూర్ హెడ్ క్వార్టర్ రోడ్లను అభివృద్ధి చెయ్యాలన్న ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.
• జంక్షన్ల అభివృద్ధి, హన్మకొండ నుంచి హసన్ పర్తి వరకు రోడ్లను అభివృద్ధి చెయ్యాలన్న ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.
• కరీంనగర్ , హంటర్ రోడ్డు, హైదరాబాద్-వరంగల్ రోడ్డు, వరంగల్ నగరంలోని రోడ్లను వెంటనే సుందరీకరణ చెయ్యాలి
• వరంగల్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన నిధులు ఖర్చు చేయడంలో, శంకుస్థాపనలు చేసిన పనులు వేగవంతంగా కొనసాగకపోవడంపై అధికారులపై అసంతృప్తి

• అసెంబ్లీలో రోడ్లు, భవనాలు, మునిసిపల్, టెక్స్ టైల్ పార్కులపై జరిగిన సమీక్ష. సమీక్షలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, మునిసిపల్ , పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గిరిజన-పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, ఎంపీ దయాకర్, మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, కొండా సురేఖా, రెడ్యా నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వినయ్ భాస్కర్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, వొడితెల సతీష్, అధికారులు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail