Browse By

ప్ర‌జా స‌మ‌స్య‌లే అస్త్రాలుగా.. విస్త‌రించాలి.

ప్ర‌జా స‌మ‌స్య‌లే అస్త్రాలుగా.. విస్త‌రించాలి. 
యుజ‌వ‌న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా వ‌ర్క్‌షాప్‌లో టిపిసిసి చీఫ్ ఉత్త‌మ్‌
తెలంగాణ రాష్ట్ర స‌మితి మొద‌టి నుంచి మాధ్య‌మాల‌పైన ఒక ర‌క‌మైన భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసే విధంగాను అధిప‌తుల‌ను బ్లాక్ మెయిల్ చేసే విధంగా బెదిరింపుల‌కు గురి చేయ‌డం లాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని దీంతో కాంగ్రెస్ పార్టీ వార్త‌లు రాయ‌డానికి, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను పాల‌కుల‌కు ఎత్తి చూపేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని, అందువ‌ల్ల కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్య‌మాన్ని కూడా ఒక ప్ర‌ధాన ప్ర‌చార వేధిక‌గా ఉప‌యోగించుకోవాల‌ని టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. 

సోమ‌వారం నాడు యువ‌జ‌న సుంద‌ర‌య్య‌ విజ్ఞాన కేంద్రంలో యువ‌జ‌న కాంగ్రెస్ అధ్య‌క్షులు అనిల్ కుమార్ యాద‌వ్ అధ్య‌క్ష‌తన జ‌రిగిన సోష‌ల్ మీడియా వ‌ర్క్ షాప్‌లో ఆయ‌న ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ప్ర‌స్తుత స‌మ‌యంలో స్మార్ట్ ఫోన్ లేని జ‌నం లేర‌ని అందుకే సోష‌ల్ మీడియా ప్ర‌భావం స‌మాజంపైన చాల ఉంద‌ని ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా చాల ముందుకు పోవాలని అన్నారు. సామాజిక మాధ్య‌మంలో స‌మాచారం చేర వేసే ముందు మంచి ఆకర్ష‌నీయంగా, నైపుణ్యంగా సృజ‌నాత్మ‌కంగా ఉండాల‌ని అప్పుడు ప్ర‌జ‌లు వాటిని ఆద‌రిస్తార‌ని అన్నారు. మ‌నం చేసే ప్ర‌చారం పార్టీ అభివృద్దిక తోడ్పాటు అందించేందుకు ఉప‌యోగ‌ప‌డాల‌ని సూచించారు. 

తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యం ఖూనీ చేయ‌బ‌డుతుంద‌ని ప‌త్రిక‌ల‌పైన‌, ప్ర‌సార మాధ్య‌మాల‌పైన యాజ‌మ‌న్యాల‌పై తీవ్ర‌మైన వ‌త్తిడి పెరిగింద‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ వ‌చ్చిన కొత్త‌లోనే రెండు ప్ర‌ధాన ఛాన‌ళ్ళ‌ను నిషేదించ‌డం ద్వారా ఈ పాల‌కులు ప్ర‌సార మాధ్య‌మాల‌పైన వారి విధానం ఎలా ఉండ‌బోతోందో తేల్చి చెప్పార‌ని వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన స‌భ‌లో పాత్రికేయుల మెడ‌లు విరుస్తా, ప‌ది కిలోమీట‌ర్ల లోతు పాతి పెడ‌తా అంటు హెచ్చ‌రిక‌లు చేశార‌ని దీంతో ప‌త్రిక‌లు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వార్త‌లు రాయ‌డానికి భ‌య‌ప‌డుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఇలాంటి ప‌రిస్థితులు గ‌తంలో ఎన్న‌డు లేవ‌ని స్వాతంత్ర భార‌త దేశంలో ఇంత‌టి అప్ర‌జాస్వామిక పాల‌న ఎప్పుడు జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌నం సామాజిక మాధ్య‌మాన్ని త‌ప్ప‌కుండా విరివిగా ఉప‌యోగించుకున్న‌పుడే మ‌న ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని అందుకు నాణ్య‌మైన కార్య‌క్ర‌మాల‌ను, సృజ‌నాత్మ‌క‌త‌తో నైపుణ్యంతో చేసి పంపాల‌ని అప్పుడే ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయ‌ని అన్నారు. దేశంలో నేడుజ‌నాభా కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయ‌ని సోష‌ల్ మీడియా ప్ర‌భావం చాల బాగుంద‌ని అన్నారు. 18 నుంచి 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న యువ‌కులు ఎక్కువ‌గా సోష‌ల్ మీడియా ప్ర‌భావంలో ఉంటున్నార‌ని వారిని ఆక‌ర్శించ‌డం చాల ప్ర‌ధాన‌మ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎఐసిసి అధికార ప్ర‌తినిధి మ‌ధుయాష్కి, టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాసోజు శ్ర‌వ‌న్‌, యూత్ కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తెలంగాణ ఇంచార్జ్ బి.వి శ్రీ‌నివాస్‌, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాధిక‌, తెలంగాణ యూత్ కాంగ్రెస్ కార్య‌ద‌ర్శి, సోష‌ల్ మీడియా ఇంచార్జ్ గుర‌జాల వెంక‌ట్ తోపాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తినిధులు పాల్గొన్నారు. 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail