Browse By

CBSE తరహాలోనే రాష్ట్రంలో అకడమిక్ ఇయర్

రాష్ట్రంలో మొదటిసారి సీబీఎస్ఈ తరహాలోనే అకడమిక్ ఇయర్ ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది. పరీక్షలు పూర్తికాగానే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. మార్చి 21 నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి క్లాస్ లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది సర్కార్.

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే టెక్స్ట్ బుక్స్ కొరత రాకుండా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 10 వతరగతి వరకు, ప్రైవేటు స్కూల్స్ లో 6 నుంచి 10వ తరగతికి.. బుక్స్ ప్రింటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈనెల 20వ తేదీలోపే స్కూల్స్ కు బుక్స్ చేరేలా ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు.

తరగతులు ముందే ప్రారంభిస్తున్నందున.. స్కూళ్లకు బుక్స్ చేర్చే పనిలో బిజీగా ఉన్నారు అధికారులు. ఇందుకోసం గత రెండు నెలలుగా ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ సూచనలతో ప్రింటింగ్ ప్రెస్ అధికారులు బుక్స్ సిద్ధంచేసి జిల్లా విద్యాశాఖ ఆఫీసులకు తరలిస్తున్నారు.

గతేడాదే కొత్త విద్యా విధానాన్ని అమలు చేయాలని సర్కార్ భావించినా సాధ్యం కాలేదు. ఈ ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail