Browse By

బేగంపేట్ వరకు మెట్రోరైలు?

బేగంపేట్ వరకు మెట్రోరైలును నడిపే అవకాశం
హైదరాబాద్ నగర ప్రజల కలల ప్రాజెక్ట్ మెట్రో ట్రైన్. పబ్లిక్ కు సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీని అందించేందుకు మెట్రోప్రాజెక్ట్ ప్రారంభించారు. ఎల్బీ నగర్ టూ మియాపూర్ 29 కిలోమీటర్ల ఫస్ట్ కారిడార్ లో..సెకండ్ స్ట్రెచ్ మియాపూర్ టూ ఎస్ఆర్ నగర్ రూట్ లో దాదాపు 12 కిలోమీటర్లు ముందుగా పబ్లిక్ కు అందుబాటులోకి తెచ్చేందుకు పనులు వేగవంతం చేశారు. మెట్రో ప్రాజెక్ట్ ను ముందుగా నాగోల్ టూ మెట్టుగుడ ప్రారంభించాలని మెట్రో అధికారులు చాలాసార్లు ప్రయత్నించారు. కానీ వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ స్ట్రెచ్ ను సికింద్రాబాద్ లేదా బేగంపేట్ వరకు పొడిగించి మెట్రో ను నడపాలని ప్లాన్ చేస్తున్నారు.

మెట్రోను పబ్లిక్ కు అందిస్తామని ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు . అవన్ని వాయిదా పడుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మియాపూర్ టూ ఎస్ఆర్ నగర రూట్ లో మెట్రోను జూన్ వరకు ప్రారంభిస్తామని మెట్రో అధికారులు, ప్రభుత్వం ప్రకటించింది. ఈ రూట్ లో టెస్ట్ రన్స్ నడుస్తున్నాయి. సెంట్రల్ రైల్వే నుంచి రైల్వే సేఫ్టీ సర్టిఫికెట్ కూడా వచ్చింది. ఈ రూట్ లో స్టేషన్లను కూడా పూర్తి స్థాయిలో రెడీ చేశారు. ఎస్ఆర్ నగర్, మైత్రి వనమ్ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్, వ్యాపారాలకు సెంటర్ గా ఉండటంతో.. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లవచ్చు. ఈ ఫేజ్ సక్సెస్ అయితే మొత్తం ప్రాజెక్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎల్అండ్ టీ భావిస్తోంది.

మెట్రో ప్రారంభంపై పబ్లిక్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మియాపూర్ టూ ఎస్ఆర్ నగర్ రూట్ తో పెద్దగా ఉపయోగం ఉండదని కొందరంటుంటే.. మరి కొందరు కొంత వరకైనా ట్రాఫిక్ సమస్య, పొల్యూషన్ భాదలు తీరతాయంటున్నారు. మెట్రో స్టేషన్స్ దగ్గర పార్కింగ్ ఏర్పాట్లు చేయకపోతే ట్రాఫిక్ సమ్యస మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail