Browse By

ఐదేళ్లలో 240 కోట్ల చెట్లను నాటడమే ప్రభుత్వ లక్ష్యం

నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేందుకే చెరువులను బాగు చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు చెప్పారు. మిషన్ కాకతీయతో రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ పెరిగిందన్నారు. అటు ఐదేళ్లలో 240 కోట్ల చెట్లను నాటడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని హైవేలపై మూడు లైన్లలో చెట్లు నాటినట్టు మంత్రి చెప్పారు. హైదరాబాద్ హరితప్లాజాలో జల సంరక్షణ – సామాజిక బాధ్యత అంశంపై సదస్సు జరిగింది. నీటిపారుదలశాఖ, వాక్ ఫర్ వాటర్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సదస్సులో మంత్రి హరీశ్ రావు, ఎంపీలు, బూర నర్సయ్యగౌడ్, బీబీపాటిల్, వాక్ ఫర్ వాటర్ కన్వీనర్ కరుణాకర్ రెడ్డి, జలవనరుల అభివృద్ధి చైర్మన్ వి ప్రకాశ్, శ్రీధర్ రావు దేశ్ పాండే, హాజరయ్యారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail