Browse By

లండన్ లో ఘనంగా టాక్ – అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

– తెలంగాణ చరిత్ర లోని మహిళల ఫోటో ఎక్సిబిషన్ ప్రత్యేక ఆకర్షణ 
 లండన్ : లండన్ మహానగరంలోని హౌన్స్లో పట్టణంలో టాక్ (తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్) ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.


టాక్ మహిళా నాయకురాలు స్వాతి బుడగం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో, యు.కె నలుమూలల నుండి భారీగా మహిళలు పాల్గొన్నారు. 
“తెలంగాణ చరిత్ర – మహిళలు” అనే అంశం తో తెలంగాణ చరిత్ర లోని వివిధ మహిళల తో కూడిన ఫోటో ఎక్సిబిషన్ నిర్వహించారు. హౌన్స్లో మేయర్ శ్రీమతి . అజ్మీర్ గారేవాల్ ఈ ఫోటో ఎక్సిబిషన్ ని ప్రారంభించారు, టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మరియు ముఖ్య నాయకులు మట్టా రెడ్డి, తదితరులు అతిధులకు దగ్గరుండి తెలంగాణ చరిత్రలో వివిధ మహిళల పాత్ర గురించి వివరించారు. 


 ఫోటో ఎక్సిబిషన్ ద్వారా ప్రదర్షింపబడిన ప్రతి ఒక్క వీరి నారీ గురించి టాక్ మహిళా సభ్యులు సభకు వివరించి వారి గొప్పదాన్ని తెలిపారు. హజారైన అతిథులు, చరిత్రను తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అభినందించారు.
  టాక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు హౌన్స్లో మేయర్ శ్రీమతి . అజ్మీర్ గారేవాల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ మహిళా దినోత్సవ వేడుకకు చాలా ప్రత్యేకత ఉందని, యుకె ప్రధాన మంత్రి ఒక మహిళా, స్థానిక హౌన్స్లో పరిసరాల్లో మహిళా ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారని, లండన్లో చాలా మంది కౌన్సిలర్ మరియు ఎం.పి. లు మహిళలు ఉండటం గర్వకారణం. ఇంతకుముందు కంటే బిన్నంగా చాలా మంది మహిళలు ముందంజలో వున్నారని తెలిపారు. 
  ఈ కౌన్సిల్లో 140 వివిధ భాషలు మాట్లాడేవారు వున్నారు అలాంటి కౌన్సిల్కు మేయరుగా ఉండటం నాకు గర్వకారణం అని మేయర్ తెలిపారు.

 ఫొటో ప్రదర్శన గురించి మేయర్ మాట్లాడుతూ నేను చాలా కార్యక్రమాలకు హాజరవుతాను కానీ ఇలాంటి భారత చరిత్రతో మహిళా పోటో ప్రదర్శనను ఇంతవరకు ఎక్కడా చూడలేదని తెలిపారు.

  మాజీ మేయర్ ప్రీతమ్ గారేవాల్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడారు.మనందరి జీవితంలో మహిళల పాత్ర చాలా కీలకమైనదని అన్నారు.
  ఈ కార్యక్రమంలో తెలంగాణ పోరాటంలో పాత్ర వహించిన మహిళా మణుల ఫొటో ప్రదర్శన ప్రత్యెక ఆకర్షణగా నిలిచింది.
      ఈ కార్యక్రమంలో పిల్లలకు, మహిళలకు వివిధ రకాల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేసారు.

 

    టాక్ అధ్యక్షురాలు పవిత్రరెడ్డి మాట్లాడుతూ పురుషులలో పాటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ప్రతిభ చాటుకుంటున్నప్పటికీ పూర్తి అస్తిత్వం కోసం ఇంకా పోరాడుతూనే వున్నారు. అమ్మగా అమృతమయిగా భార్యగా భాగస్వామిగా సోదరిగా సహృదయిగా కూతురిగా కంటి పాపగా అణువు నుండి అనంతంగా నేటి సృష్టిలో సగ భాగమైన స్త్రీ ప్రాధాన్యతని తెలిపేందుకు నిర్విరామంగా కృషి చేస్తూనే వుందని తెలిపారు.
  టాక్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ఎన్నో బాలారిష్టాలు అధిగమించుతూ మహిళలు పోషిస్తున్న పాత్ర ఎనలేనిదని అలాగే ఇలాంటి మన చరిత్రను ముందు తరాలకు అందజేసి కార్యక్రమాలు మరెన్నో మున్ముందు చేపట్టేందుకు టాక్ సంస్థ ముందుంటుందని సభా ముఖంగా చెప్పారు .

స్థానిక ప్రవాస సంస్థల ప్రతినిధులు ప్రభాకర్ కాజా,అశోక్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు లేకపోతె జాతి మనుగడ లేదు అని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో చాలా మంది తెలంగాణ ఆడబిడ్డలు పాల్గొని వారి అభిప్రాయాలను తెలిపారు. 
మేయర్ తో కలిసి టాక్ మహిళా సభ్యులు మరియు హాజరైన అతిథులంతా కలిసి కేక్ కట్ చేసి, ఒకరికొకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 
 టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది,​​​​​​ మేయర్ అజమేరాను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. 
టాక్ మహిళా సభ్యురాలు శ్రీ శ్రావ్య వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, సభ్యులు స్వాతి బుడగం, జాహ్నవి వేముల, శ్రావ్య వందనపు, సుప్రజ పులుసు, సుమ రేకుల, శ్వేతా, శ్రీలత, విజయ లక్ష్మి , ప్రవల్లిక , అపర్ణ మరియు ఇతర సంస్థల ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నవారిలో ఉన్నారు. 

Photo Exhibition List :
1 ) Chakali Ailamma 
2) Mallu Swarjyam 
3) Rudramadevi 
4) Nagamma 
5) Chennaboina kamalamma 
6) Konne Pullamma
7) Viplava Rangakka 
8) Nalla Vajramma 
9) Katkuri Susheela 

10) Bandru Narsamma Avva 
11) Arutla Kamala Devi 
12)Kuppambika
13) Sangam Lakshmi Bhai
14) Bandaru Achamamba 
15) Nandagiri Indiradevi 
16) J Eshwari Bhai 
17) T S Sadalakshmi 
18) Pakala Yashoda Reddy 
19) Smt. kalvakuntla Kavitha 
20) Dayam Priyamvada 

21) Polkampalli Shanthadevi 
22) Tara Balakrishna 
23) Saritha women Bus driver-
24) G Malini Reddy 
25) Madireddy Andamma 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail