Browse By

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై క్షేత్ర‌స్థాయి పోరాటాలు

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై క్షేత్ర‌స్థాయి పోరాటాలు ః దిగ్విజ‌య్ సింగ్ 

ఏప్రిల్ నెల‌లో గిరిజ‌న ఘ‌ర్జ‌నలు, ….ఎఐఎంతో పోరాట‌మే

 ః మ‌హిళ‌లు స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు చేయాలి

 ః గాంధీభ‌వ‌న్‌లో వ‌ర‌స కార్య‌క్ర‌మాలు

 ః పాల్గొన్న టిపిసిసి చీఫ్ ఉత్త‌మ్‌, భ‌ట్టి ఇత‌ర నాయ‌కులు 

గిరిజ‌న హ‌క్కుల‌ను కాల‌రాస్తూ హ‌రిత హారం పేరుతో గిరిజ‌న భూముల‌ను అక్ర‌మంగా స్వాధీనం చేసుకొని వారికి భూముల లేకుండా చేస్తున్న మూడేళ్ళుగా వారికిచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌కుండా మోసం చేస్తున్న టిఆర్ ఎస్ ప్ర‌భుత్వంపైన గిరిజ‌న ఘ‌ర్జ‌న పేరుతో ఉద్య‌మం చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు గురువారం గాంధీభ‌వ‌న్‌లో మాజీ కేంద్ర మంత్రి బ‌ల‌రామ్ నాయ‌క్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన గిరిజ‌న నేత‌ల స‌మావేశంలో ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, తెలంగాణ ఇంచార్జ్ దిగ్విజ‌య్ సింగ్‌, కార్య‌ద‌ర్శి ఆర్‌.సి కుంటియా, టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కార్య నిర్వాహ‌క అధ్య‌క్షులు భ‌ట్టి విక్ర‌మార్క‌, మండ‌లి విప‌క్ష నేత ష‌బ్బీర్ అలీ, మాజీ మంత్రి దానం నాగేంద‌ర్, ఎస్‌.టి సెల్ చైర్మ‌న్ జ‌గ‌న్ లాల్ నాయ‌క్‌, నాయ‌కులు మాజీ ఎం.పి ర‌వీంద్ర నాయ‌క్‌, పోడెం వీర‌య్య‌, రేగ కాంతారావు, బెల్ల‌య్య నాయ‌క్‌, శంక‌ర్ నాయ‌క్ త‌దిత‌రులు పాల్గొన్నారు. స‌మావేశం అనంత‌రం టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గాంధీభ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ గిరిజ‌నుల‌కు అనేక హ‌మీలు ఇచ్చిన టిఆర్ ఎస్ ఇప్ప‌డు గ‌తంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన భూముల‌ను కూడా అక్ర‌మంగా స్వాధీనం చేసుకొని హ‌రిత హారం పేరుతో మొక్క‌లు నాటుతుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గిరిజ‌నుల‌కు ప్ర‌భుత్వాలు క‌ల్పించిన చ‌ట్టాలు ఎలా అమ‌లు అవుతున్నాయో ప్ర‌తి ఏటా రాష్ట్ర‌ప‌తికి నివేదిక‌లు ఇవ్వాల్సిన గ‌వ‌ర్న‌ర్ అవేమి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గిరిజ‌నుల న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు వారికి అండ‌గా ఉండేందుకు కార్య‌క్షేత్రంలో పోరాటాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంద‌ని అందుకోసం ఏప్రిల్ నెల‌లో 9వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు గిరిజ‌న పోరాటాలు చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందించామ‌ని 9వ తేదీన ఖ‌మ్మంలో గిరిజ‌న ఘర్ఝ‌న‌, ఏప్రిల్ 13న దామెర‌చ‌ర్ల‌లో గిరిజ‌నుల‌తో బ‌హిరంగ స‌భ‌, ఏప్రిల్ 23న ర‌వీంద‌ర్ నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో నిజాం కాలేజీ గ్రౌండ్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌, ఏప్రిల్ 30వ తేదీన ఆదిలాబాద్‌లో గిరిజ‌న స‌భ నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు. కార్య నిర్వ‌హ‌క అద్య‌క్షులు భ‌ట్ట విక్ర‌మార్క మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజ‌న హక్కుల‌ను నిలువునా కాల రాస్తుంద‌ని, విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హాయాంలో గిరిజ‌నుల‌కు భూమిపై హ‌క్కులు క‌ల్పిస్తే ఈ పాల‌కులు బ‌ల‌వంతంగా గుంజుకున్నార‌ని, గిరిజ‌నుల‌కు హ‌క్కుల‌కు భంగం క‌లిగితే రాష్ట్ర‌ప‌తికి నివేధిక ఇవ్వాల్సిన గ‌వ‌ర్న‌ర్ ఎలాంటి స‌హాకారం అందించ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గిరిజ‌నుల హ‌క్కుల‌కు భంగం క‌ల‌గ‌కుండా వారికి అండ‌గా ఉంటామ‌ని ఆయ‌న అన్నారు. ఇంకా ఈ స‌మావేశంలో బ‌ల‌రాంనాయ‌క్‌, ర‌వింద‌ర్ నాయ‌క్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

లౌకిక‌వాదం కాంగ్రెస్‌తోనే సాధ్యం… 

ఎంఐఎంతో పోరాట‌మే ః 19న షాద్‌న‌గ‌ర్‌లో స‌భ 

మైనారిటీ స‌మావేశంలో దిగ్విజ‌య్ సింగ్‌
ఈ దేశం లౌకిక వాద పునాదుల‌పై నిర్మాణం అయి ఉంద‌ని, కాంగ్రెస్ పార్టీ అస‌లైన లౌకిక వాద పార్టీ అని కాంగ్రెస్ తోనే దేశంలో మ‌త సామ‌ర‌స్యం నిలిచి ఉంటుంద‌ని ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దిగ్విజ‌య్ సింగ్ అన్నారు. గురువారం గాంధీభ‌వ‌న్‌లో మైనారిటీ సెల్ చైర్మ‌న్ ఫ‌క్రూద్దీన్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఎంఐఎం, బిజెపి లాంటి మ‌త త‌త్వ పార్టీలు దేశ‌వ్యాప్తంగా లోపాయికారిగా క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని ఎం.ఐ.ఎంపై మ‌నం పోరాటం చేయాల్సిందేన‌ని అన్నారు. మైనార్టీల‌కు అండ‌గా నిలిచేది కాంగ్రెస్ పార్టీనేన‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని అధికారంలోకి తేవ‌డానికి మైనార్టీలు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు. టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లీంల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని చెప్పిన టిఆర్ ఎస్ ఇంత‌వ‌ర‌కు ఎలాంటి ముందుడుగు వేయ‌లేద‌ని ముస్లీంల‌ను ఎన్నిక‌ల‌లో ఓట్ల కోసం వాడుకొని మోసం చేసింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కేసిఆర్ ప్ర‌భుత్వంపైన పోరాటాలు చేయాల‌ని పిలుపునిచ్చారు. మండ‌లి విప‌క్ష నేత ష‌బ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ముస్లీంల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డం వ‌ల్ల అనేక మంది ఉన్న‌త విద్యాభ్యాసం, ఉద్యోగాలు పొంద‌గ‌లిగార‌ని ఈ విష‌యాల‌పై రాష్ట్ర వ్యాప్తంగా ప‌వ‌ర్ పాయింట్ ప్రెసెంటేష‌న్ ఇచ్చి ప్ర‌చారం చేస్తాన‌ని అన్నారు. అలాగే ఏప్రిల్ 19వ తేదీన మూడేళ్ళ క్రితం కేసిఆర్ షాద్ న‌గ‌ర్‌లో స‌భ నిర్వ‌హించి ముస్లీంల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చార‌ని అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత 4 నెల‌ల్లో ఈ ప‌నులు పూర్తి చేస్తాన‌ని చెప్పిన కేసిఆర్ మూడేళ్ళ‌యినా అడ్ర‌స్ లేద‌ని అన్నారు. ఈ విష‌యంలో అదే షాద్ న‌గ‌ర్‌లో 19వ తేదీన స‌మావేశం నిర్వ‌హించాల‌ని ఆయ‌న సూచించారు ఈ స‌మావేశంలో ఎఐసిసి కార్య‌ద‌ర్శి ఆర్‌.సి కుంటియా, టిపిసిసి కార్య నిర్వాహ‌క అధ్య‌క్షులు భ‌ట్టి విక్ర‌మార్క లు మాట్లాడారు. మైనారిటీ నాయ‌కులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail