Browse By

వెంటనే ధర్నాలు మానుకోవాలి: కడియం

హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైమ్ అధ్యాపకుల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వెంటనే ధర్నాలు మానుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. 11 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైమ్ అధ్యాపకులు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆయన నివాసంలో కలిశారు. వారి సమస్యలను వివరించారు.ప్రస్తుతం పరీక్షలు సమీపిస్తున్నపుడు, పైగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సమ్మె చేయడం సరైంది కాదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధ్యాపకులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సమ్మె తక్షణమే విరమించాలన్నారు.

జీతాల పెంపు విషయం, సర్వీసుల క్రమబద్దీకరణ చేయడం కోసం ప్రభుత్వం కమిటీ వేసి అధ్యయనం చేయించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు, పార్ట్ టైమ్ అధ్యాపకుల పట్ల సానుకూలంగా ఉందన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలు కూడా త్వరలో జరగనున్న నేపథ్యంలో యూనివర్శిటీలో చక్కని వాతావరణం నెలకొల్పేలా, విశ్వవిద్యాలయ అభివృద్ధికి దోహదపడేలా అధ్యాపకులు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విజ్ణప్తి చేశారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail