Browse By

కేసిఆర్..లుచ్చా మాట‌లు క‌ట్టిపెట్టు: టిపిసిసి చీఫ్ ఉత్త‌మ్‌

కేసిఆర్ కుటుంబం దోపిడీ దొంగ‌ల బందిపోటు ముఠా ః కేసిఆర్..లుచ్చా మాట‌లు క‌ట్టిపెట్టు 

ఆంధ్రా కాంట్రాక్ట‌ర్లకు వేల కోట్లు దోచి పెట్టి సూట్‌కేసులు తీసుకుంటుంది నువ్వే…

నువ్వేమైనా రాజ్యంగానికి అతీతుడివా… 

ధ‌నిక రాష్ట్రం చేతిలో పెడితే అప్పుల కుప్ప చేశావు..

క‌మీష‌న్ల కోస‌మే అప్పులు… 

ఒక యూనిట్ విద్యుత్ ఉత్ప‌త్తి చేశారా ? 
కేసిఆర్‌పై విరుచుప‌డ్డ టిపిసిసి చీఫ్ ఉత్త‌మ్‌

కేసిఆర్ కుటుంబం దోపిడీ దొంగ‌ల ముఠాలాగా ఏర్ప‌డి తెలంగాణ‌లో వేల కోట్ల రూపాయ‌లు దోచుకుంటున్నార‌ని, ఆంద్రా కాంట్రాక్టర్ల‌కు వేల కోట్ల రూపాయ‌ల ప‌నులు క‌ట్ట‌బెట్టి సూట్‌కేసులు తీసుకుంటూ కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, లుచ్చా మాట‌లు క‌ట్టి పెట్టి ప్ర‌జ‌లకు మేలు చేసే పనులు చేయాల‌ని టిపిసిసి అద్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. శ‌నివారం గాంధీభ‌వ‌న్‌లో సి.ఎల్‌.పి నేత జానారెడ్డి, మండ‌లి విప‌క్ష నేత ష‌బ్బీర్ అలీ, మాజీ పిసిసి అధ్య‌క్షులు, ఎఐసిసి కార్య‌ద‌ర్శి వి.హ‌నుమంత‌రావు, మాజీ పిసిసి అధ్య‌క్షులు, ఇంప్లిమేంటేష‌న్ క‌మిటీ చైర్మ‌న్ పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, మాజీ ఉప ముఖ్య‌మంత్రి దామోద‌ర్ రాజ న‌ర్సింహ్మ‌, టిపిసిసి ఉపాధ్య‌క్షులు మ‌ల్లు ర‌వి, టిపిసిసి అధికార ప్ర‌తినిధి, మాజీ విప్ తూర్పు జ‌గ్గారెడ్డిల‌తో ఆయ‌న శ‌నివారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్య‌మంత్రి కూడా ఇంత నీచ‌మైన స్థితికి దిగ‌జారి మాట్ల‌డార‌ని, కాంగ్రెస్ నాయ‌కుల‌పైన కేసిఆర్ చే్స్తున్న ప్ర‌చారాన్ని తీవ్రంగా ఖండి స్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. రాజ‌కీయంగా పూర్తిగా దిగ‌జారిపోయిన కేసిఆర్ ఏమి మాట్ల‌డుతున్నార‌ని రాజ‌కీయాల‌ను పూర్తిగా భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. స్వంత డ‌బ్బుల‌తో దేవుళ్ళ మొక్క‌లు తీర్చుకుంటే ఎవ‌రికి అభ్యంత‌రం లేద‌ని, ప్ర‌జా ధ‌నాన్ని మొక్కుల‌కు కేటాయిస్తూ ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దూరం పెడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మ‌న దేశం రాజ్యంగం ప్ర‌కారం లౌకిక దేశ‌మ‌ని ఇక్క‌డ ప్ర‌జా ధ‌నాన్ని ఏ ర‌కంగా మొక్కుల‌కు కేటాయిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. విద్యార్థుల‌కు ఫీజులు క‌ట్ట‌డం లేదు, రైతుల‌కు రుణాలు క‌ట్ట‌డం లేద‌ని, వందల కోట్ల రూపాయ‌ల‌తో ఇళ్ళు క‌ట్టుకోవ‌డం, ప్ర‌త్యేక విమానాల‌లో తిర‌గ‌డం, మొక్కులు చెల్లించ‌డం ప్ర‌శ్నిస్తే దిగ‌జారిపోయి మాట్ల‌డ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేసిఆర్ లాంటి దిగ‌జారిపోయి, నీచ రాజ‌కీయాలు చేసే నాయ‌కుల‌ను దేశంలో ఎక్క‌డా చూడ‌లేద‌ని, లుచ్చా మాట‌లు మాట్ల‌డితే ఊరుకునేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. వేల కోట్ల రూపాయ‌లు అప్ప‌లు చేస్తూ క‌మీష‌న్లు తీసుకుంటు ప్ర‌జల‌పై అప్పుల భారం వేస్తున్నార‌ని, ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయ‌కుండా రాష్ట్రంలో ఎలా విద్యుత్ స‌మ‌స్య ప‌రిష్కరించార‌ని, తాము చేప‌ట్టిన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా వ‌చ్చిన విద్యుత్ ఇప్పుడు తాము ఉత్ప‌త్తి చేశామ‌ని చెప్పుకుంటున్నార‌ని, రాష్ట్రంలో విగులు విద్యుత్‌కు కాంగ్రెస్ పార్టీ పాన‌ల‌నే కార‌ణ‌మ‌ని ఆయ‌న వివ‌రించారు. తాము నీటి పారుద‌ల ప్రాజెక్టులు నిర్మిస్తే వాటిని ఇప్ప‌డు స్విచ్ ఆన్ చేసి తాము నిర్మించామ‌ని చెప్పుకోవ‌డం సిగ్గు చేట‌ని ఆయ‌న అన్నారు. ఒక్క భ‌క్త రామ దాసు ప్రాజెక్టు గురించి చెబుతున్నార‌ని నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టునే స‌రిగా నీళ్ళు లేవ‌ని పాలేరు జ‌లాశ‌యం నుంచి రెండు పంపులు పెట్టి అదేదో గొప్ప ప‌నిగా చెప్పుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు. నోరు తెరిస్తే అబ‌ద్దాలు త‌ప్ప ప్ర‌జ‌ల కోసం చేసిందేమి లేద‌ని, కేవ‌లం ప్ర‌చార ఆర్భాటాలు త‌ప్ప ప్ర‌జ‌ల‌కు చేసిందేమి లేద‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. కేసిఆర్ త‌మ‌పై ఏ ర‌క‌మైన భాష ప్ర‌యోగిస్తే అంత‌కంటే ఘాటుగా తాము స్పందిస్తామ‌ని, ఇక ఊరుకునేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 

మాజీ ఎం.పి వి.హ‌నుమంత‌రావు మాట్లాడుతూ టిఆర్ ఎస్‌లో త్వ‌ర‌లో సునామి రాబోతుంద‌ని, ఎవ‌డ‌బ్బ సొమ్ము అని ప్ర‌భుత్వ నిధుల‌ను మొక్కుల‌కు కేటాయిస్తున్నావ‌ని ప్ర‌శ్నించారు. ధ‌ర్నా చౌక్‌ను ఇందిరాపార్్క నుంచి మార్చి న‌గ‌రానికి దూరంగా పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఇది వెంట‌నే విర‌మించుకోవాల‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌ల నుంచి రోజు రోజుకు నిర‌స‌న‌లు ఎక్కువ‌వుతున్నాయ‌ని దీంతో జీర్ణించుకోలేని కేసిఆర్ ధ‌ర్నాలు లేకుండా చేయాల‌ని చూస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బి.సిల‌ను ఓట్ల కోసం వాడుకునేందుకు గొర్రెలు, బ‌ర్రెలు, చేప‌లు ఇస్తామంటు మోసం చేస్తున్నార‌ని బి.సిల‌కు ఉన్న‌త చ‌దువులు కావాల‌ని అధికారం పీఠం కావాల‌ని అందుకోసం ఉద్య‌మిస్తామ‌ని ఆయ‌న అన్నారు. 

మండ‌లి విప‌క్ష నేత ష‌బ్బీర్ అలీ మాట్లాడుతూ కేసిఆర్ చీట‌ర్ అని అన్నారు, కామ‌న్ గుడ్ ఫండ్ నుంచి నిధుల‌ను ఈ ర‌కంగా ఖ‌ర్చు చేయ‌డం చ‌ట్ట వ్య‌తిరేక‌మ‌ని అన్నారు. మ్యానిఫెస్టోలు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నిల‌బెట్టుకోలేద‌ని విమ‌ర్శించారు. 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail