Browse By

వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవిలో MLC మహ్మద్ సలీమ్

రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహ్మద్ సలీమ్ ఎన్నికయ్యారు. వక్ఫ్ బోర్డు పాలక మండలిలోని 11 మంది సభ్యుల్లో 9 మంది బోర్డు కార్యాలయంలో సమావేశమై సలీమ్ ను చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేనేజింగ్ కమిటీ కోటాలో బోర్డు సభ్యుడిగా ఉన్న మీర్జా అన్వర్ బేగ్ చైర్మన్ పదవికి సలీమ్ పేరును ప్రతిపాదించగా.. నామినేటెడ్ సభ్యుడు మాలిక్ మొతసీమ్ ఖాన్ బలపరిచారు. ఎవరూ అభ్యంతరం చెప్పక పోవడంతో సలీమ్ ఎన్నికైనట్లు హుస్సామీ ప్రకటించారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail