Browse By

డిప్యూటీ కలెక్టర్ గా పి.వి.సింధు

భారత షట్లర్‌,రియో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పి.వి.సింధు ఇక డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. సింధుకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌ పోస్ట్ ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సింధు తల్లి విజయ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు సింధుకు భారీ నజరానాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.3కోట్లు, గ్రూప్‌-1 ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే సింధుకు డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు సిద్ధం చేస్తోంది. దీనిపై సింధు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం సింధు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బిపిసిఎల్‌ హైదరాబాద్ కార్యాలయంలో 2013 నుంచి అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుటికే ఆమెకు మూడు కోట్ల రూపాయల నగదు, తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నగదు ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు హైదరాబాద్‌లో వెయ్యి గజాల స్థలం కూడా ఇచ్చింది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail