Browse By

మరో మైలురాయి దాటిన ఇస్రో – 4 టన్నుల ఉపగ్రహాలు పంపే సత్తా

‘జీఎస్‌ఎల్వీ-మార్క్‌3’ విజయవంతం, మార్చిలో జీశాట్‌-19తో రోదసిలోకి.

ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను రోదసిలోకి విజయవంతంగా ప్రయోగించి సత్తా చాటుకున్న ఇస్రో మరో మైలురాయిని దాటింది. ఏకంగా 4 టన్నుల భారీ ఉపగ్రహాలను రోదసిలోకి చేరవేయగలిసే సత్తాను సొంతం చేసుకుంది. శుక్రవారం నిర్వహించిన జీఎ్‌సఎల్‌వీ-మార్క్‌3 క్రయో ఇంజనకు పూర్తి భూస్థిర కక్ష్య పరీక్ష విజయవంతమైంది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఐపీఆర్సీ కేంద్రంలో ఈ పరీక్షను నిర్వహించారు.

ప్రయోగ సమయంలో 640 సెకన్లు ఈ క్రయోఇంజన పనిచేయాల్సి ఉంది. ఆ సమయంలో భూస్థిర పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఇక నాలుగు టన్నుల ఉపగ్రహాలు ప్రయోగించే సత్తా ఇస్రోకు సమకూరినట్లు అయ్యింది. మార్చిలో జీఎ్‌సఎల్‌వీ-మార్క్‌3 రాకెట్‌ను ప్రయోగించే సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ రాకెట్‌ ద్వారా మన దేశ కమ్యూనికేషన రంగానికి అవసరమైన భారీ ఉపగ్రహం ‘జీశాట్‌-19’ను ప్రయోగించనున్నారు. కాగా, శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌09 రాకెట్‌కు చెందిన రెండో దశ పరికరాలు శుక్రవారం రాత్రి షార్‌కు చేరాయి. మహేంద్రగిరిలోని ఐపీఆర్సీ నుంచి ఈ పరికరాలను రెండు కంటైనర్లలో రోడ్డు మార్గాన షార్‌కు తీసుకువచ్చారు. అయితే మూడో దశ క్రయోఇంజనలో సాంకేతిక లోపం ఉండటాన్ని ఇప్పటికే గుర్తించారు.

ఈ ప్రయోగం ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail