Browse By

మున్సిపల్ శాఖపైన పురపాలన శాఖ మంత్రి కె తారక రామారావు సమీక్ష

మున్సిపల్ శాఖపైన పురపాలన శాఖ మంత్రి కె తారక రామారావు సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వివరాలు, ఇప్పటిదాకా అర్ధిక శాఖ నుంచి విడుదల అయిన నిధుల వివరాలతో ఒక నివేదిక ఇవ్వాలని పురపాలన శాఖ కార్యదర్శిని అదేశించారు. ఈ అర్ధిక సంవత్సరానికి రావాల్సిన నిధులపైన అర్ధిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. జియచ్ యంసి అద్వర్యంలో చేపట్టనున్న మౌళిక సదుపాయాల కల్పన పనుల సన్నాహాలను మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా నగరం నుంచి శివార్ల వరకు చేపట్టనున్న ఎక్స్‌ ప్రెస్ వే ల నిర్మాణం తాలుకు ప్రణాళికలను, వాటికి అవసరం అయిన నిధుల సేకరణ అంశాల మీద చర్చించారు. వివిధ ఎజెన్సీల నుంచి నిధుల సహకారానికి సూచనప్రాయంగా అంగీకారం లభించిందన్నారు. నాలల పుడికతీత పనుల ఏడాది పొడగునా చేపడతామని చెప్పినట్టే, ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలోని నాలాల సర్వే వారం రోజుల్లో పూర్తి అవుతున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా పురపాలికల్లో ఏల్ఈడీలతో లైట్ల బిగింపు ప్రక్రియ ఎంత వరకు వచ్చిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఉగాది నాటికి అన్ని పురపాలికల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని సిడియంఏ శ్రీదేవికి అదేశాలు జారీ చేశారు. అన్ని పురపాలికల్లో అర్భన్ హెల్త్ సెంటర్లు ఉండాలని, ఈ మేరకు ప్రతిపాధనలు తయారు చేయాలన్నారు. అవుర్ రింగ్ రోడ్డు మీద పూర్తి స్దాయిలో ఏల్ఈడీ లైటింగ్ ఎర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని యచ్‌యండిఎ అధికారులను అదేశించారు. యచ్ యండిఎ తయారు చేస్తున్న మాస్టర్ ప్లాన్ పైనా మంత్రి సమీక్షించారు. ఈ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వచ్చే 848 గ్రామాలు, 71 మండలాలు, 7 జిల్లాలు, 12 పురపాలికలతో కలిసి పనిచేసిన తీరుపైన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి దాకా వచ్చిన సూచనలు, అభ్యంతరాలను, మార్పు చేర్పులతో కూడిన ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వమని కమీషనర్‌ను అదేశించారు. 

మెట్రో వాటర్ వర్క్స్‌ ద్వారా ప్రయోగాత్మకంగా ప్రతి రోజు తాగు నీళ్లిచ్చే కార్యక్రమం ప్రణాళికలను మంత్రికి యండి దాన కిశోర్ వివరించారు. ఈ కార్యక్రమాన్ని దశల వారీగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. వారం పది రోజుల్లో పలు బస్తీల్లో ప్రయోగాత్మకంగా రోజు తాగు నీరు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రికి తెలిపారు. మూసి నది అథారిటీ ఎర్పాటు పైన మంత్రి సమీక్ష నిర్వహించారు. మూసి నది పునరుజ్జీవనం కోసం చేపడుతున్న ప్రణాళికలను దీర్ఘకాలం కోసం తయారు చేయాలని మంత్రి కోరారు.

ఈ సమావేశంలో జియచ్‌యంసి, హెచ్‌యండిఏ, యచ్‌యంఅర్, కమీషనర్లు, సిడియంఏ, మెట్రో వాటర్ యండి, ఇతర అధికారులు ఉన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail