Browse By

రెండో రోజు దక్షిన కోరియా పర్యటన

మూసి ప్రక్షాళన కోసం అంతర్జాతీయ అనుభవాలను పయోగించుకుంటామని పురపాలన శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. రెండో రోజు దక్షిన కోరియా పర్యటనలో ఉన్న మంత్రి యాంగ్ జీ సియోల్ లో ఉన్న Cheonnggyecheon నది ప్రక్షాళన జరిగిన తీరుని మంత్రి పరిశీలించి తెలుసుకున్నారు. నది ప్రక్షాళన కోసం అక్కడి ప్రబుత్వం తీసుకున్న కార్యక్రమాలను, పనులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. నదిని ప్రక్షాళన చేసిన అధికారుల నిబద్దతను మంత్రి ప్రశంచించారు. ప్రజల బాగస్వామ్యం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు సాద్యం అవుతాయన్నారు. అక్కడ ప్రజల బాగసామ్యం ద్వారానే ఇంతటి కార్యక్రమం సాద్యం అయ్యిందని మంత్రికి అక్కడి అధికారులు తెలిపారు. నది ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన తీరుని మంత్రి తెలుసుకున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరం మద్య నుండి ప్రవహించే మూసి నదిని ప్రక్షాళన చేస్తుంద‌ని, అందుకోసం దీర్షకాలిక లక్ష్యాలతో పనిచేస్తామ‌ని తెలిపారు. ప్రస్తుతం భాపు ఘాట్ వద్ద కొంత దూరాన్ని సుందరీకరణ చేస్తున్నమని తెలిపిన మంత్రి , మూసి నదీ ప్రక్షాళన చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రపంచంలోని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన ప్రాంతాల అనుభావాలను అధారంగా పనిచేస్తామని తెలిపారు. 

హనమ్ సిటీలోని యూనియన్ టవర్స్ లో పర్యటించిన మంత్రి అక్కడి వేస్ట్ మేనేజ్ మెంట్ పద్దతులుపైన అధ్యాయనం చేశారు. దీంతోపాటు నగరంలో వాయు కాలుష్యం తగ్గించేందుకు చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. హైదారాబాద్ నగరంలోనూ వాయు కాలుష్యం తగ్గించేందు తాము ఒక అథారిటినీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే నగరంలోని కాలుష్య పరిశ్రమలను తరలిస్తామని తెలిపారు. 

మంత్రి కెటి రామారావును కొరియాలోని ప్రముఖ పత్రిక డాంగ్ అ ఇల్బో ఇంటర్యూ చేసింది. తెలంగాణలోని ప్రభుత్వపాలసీలు, పరిశ్రమలు, పెట్టుబడులుకున్న అవకాశాలను మంత్రి ఇంటర్యూలో తెలిపారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail