Browse By

తెలంగాణ‌లోనే గిరిజ‌న సంక్షేమం

ఉద్య‌మంలోనే కాదు పున‌ర్నిర్మాణంలోనూ

 

ఉపాధ్యాయుల‌ది గ‌ణ‌నీయ‌మైన పాత్ర‌

 

-టిజియుఎస్ డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి, గిరిజ‌న సంక్షేమ మంత్రి చందూలాల్‌

 


హైద‌రాబాద్ ః తెలంగాణ ఉద్య‌మం, సాధ‌న‌లో కీల‌క పాత్ర పోశించిన ఉపాధ్యాయులు తెలంగాణ పున‌ర్నిర్మాణంలోనూ కీల‌క భూమిక‌ను పోశిష్తున్నార‌న్నారు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. తెలంగాణ గిరిజ‌న ఉపాధ్యాయ సంఘం డైరీని మంత్రి బుధ‌వారం బ‌షీర్‌బాగ్ ప్రెస్ క్ల‌బ్‌లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, స‌మాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల‌ది కీలక పాత్ర అని, విద్యార్థుల‌ని భావి భార‌త పౌరులుగా తీర్చిదిద్ద‌డంలో, రేప‌టి న‌వ భార‌త నిర్మాణంలో అలుపెరుగ‌క శ్ర‌మిస్తున్న‌ది ఉపాధ్యాయులేన‌న్నారు. నాడు తెలంగాణ ఉద్య‌మంలో మేం సైతం అంటూ పోరాటం చేసి, తెలంగాణ‌ను సాధించేందుకు స‌హ‌క‌రించార‌న్నారు. అలాగే ఉపాధ్యాయ లోకం తెలంగాణ పున‌ర్నిర్మాణంలోనూ భాగ‌స్వాములు కావాల‌ని, విద్యార్థుల‌ను రేప‌టి తెలంగాణకు నిర్మాత‌లుగా తీర్చిదిద్దాల‌ని ఆకాంక్షించారు. గిరిజ‌న సంక్షేమానికి కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు. అమ‌లు అవుతున్న ప‌లు గిరిజ‌న సంక్షేమ ప‌థ‌కాలే ఇందుకు ఉదాహ‌ర‌ణ అన్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో ఆవిర్భ‌వించిన టిజియుఎస్ డైరీని ఆవిష్క‌రించ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు.

 
ఈ కార్య‌క్ర‌మంలో గిరిజ‌న సంక్షేమ‌శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్య‌మంలో అన్ని రంగాల్లోని గిరిజ‌నులు ముఖ్య‌పాత్ర‌ని పోశించార‌న్నారు. అయితే గిరిజ‌న సంక్షేమానికి తెలంగాణ ప్ర‌భుత్వం కంక‌ణ బ‌ద్ధంగా ప‌ని చేస్తున్న‌ద‌ని చెప్పారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం గౌర‌వ అధ్య‌క్షుడు శ్రీ‌నివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు లేనిదే ఏ ఉద్య‌మం లేద‌న్నారు. ఇంకా ఈ స‌మావేశంలో టిజియుఎస్ గోవింద‌నాయ‌క్‌, సంఘం ఇత‌ర బాధ్యులు, ప‌లువురు గిరిజ‌న ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail