Browse By

శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ హరీష్ రావు ప్రెస్ మీట్.

*శీతాకాల సమావేశాలు 18 రోజులు జరిపి రికార్డ్ సృష్టించాం.

*విపక్షాలతో సభ లో శభాష్ అనిపించుకున్నాం.

*జాతీయ స్థాయి లో సభల నిర్వహణకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.


*సభానాయకుడి గా కెసిఆర్ ఉదారవాది,మానవతా వాది గా వ్యవహరించారు కాబట్టే సమావేశాలు సజావుగా నడిచాయి.*

*గతం లో సభానాయకుల సంకుచిత మనస్తత్వం, అహంభావం తో సభలు నడవలేదు..కెసిఆర్ అందుకు భిన్నంగా వ్యవహరించారు.

*సమయం తో నిమిత్తం లేకుండా చర్చలు అర్ధవంతంగా జరిగాయి.

*కెసిఆర్ సభ్యులు అడిగిన దాంట్లో న్యాయ మైన వాటికి స్వ,పర సభ్యులు అనే తేడా లేకుండా అంగీకారం తెలిపారు.

*విపక్షాలు సభ బయట చెప్పినవి అబద్దమని అసెంబ్లీ లో నిరూపించగలిగాం.

*విపక్షాలు అడిగిన అన్ని అంశాల ఫై చర్చకు అవకాశం ఇచ్చాం..15 అంశాల పై స్వల్ప కాలిక చర్చ జరగడం నాకు తెలిసి ఇదే మొదటి సారి.

*సభలో విధాన పరమైన ప్రకటన లు చేసి సీఎం కెసిఆర్ సభా హుందా తనం పెంచారు.

*హౌజింగ్ ఫై చర్చ సందర్భంగా 3600 కోట్ల రూపాయల బకాయిలు మాఫీ చేస్తామని కెసిఆర్ ప్రకటించి విపక్షాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశారు.

*మొదటి సారి మత్స్య కారుల గురించి సభ చర్చించి వారికి భరోసా నిచ్చింది.

*సభ లో అది చేస్తాం ఇది చేస్తామన్న విపక్షాలు చివరికి ప్రభుత్వాన్ని అభినందించక తప్పలేదు.

*మా ప్రభుత్వం ప్రజల కోసం చిత్త శుద్ది తో పని చేస్తోంది కాబట్టే సభలో అన్నిటికి ధీటుగా సమాధానం చెప్పగలిగాం.

*టీ.ఆర్.ఎస్..ఒక్క నిమిషం కూడా సభాసమయం వృధా చేయలేదు.

*సభా నాయకుడిగా సీఎం కెసిఆర్ మొత్తం 9 గంటల 17 నిమిషాలు మాట్లాడారు.

*మొత్తం 16 బిల్లులు ఆమోదించాం.

*శీతాకాల సమావేశాలు ఆనవాయితీగా గరిష్టం గా పది రోజులు జరిగేవి..ఇపుడు 18 రోజులు జరిగాయి.

*మేము మొండి తనానికి పోలేదు కాబట్టే సమావేశాలు హుందాగా జరిగాయి.

*సహకరించిన విపక్షాలకు కూడా ధన్యవాదాలు.

*తెలంగాణ లో సమావేశాలు ఎపుడూ ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail