Browse By

‘డిజిధన్ మేళాకు’ కు అపూర్వ స్పందన

ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరు

– వేలాదిగా పాల్గొన్న ప్రజలు, రైతులు

– రెండవ రోజు కొనసాగనున్న మేళా

 

( “సాఫ్ట్ నెట్ – మన టీవీ” )

     తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ‘డిజిధన్ మేళాకు’ కు అపూర్వ స్పందన లభించింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల నుంచి వివిధ వర్గాల ప్రజలు రైతులు వేలాదిగా పాల్గొన్నారు. సందర్శుకులతో మేళాలోని స్టాల్ల్స్ కిక్కిరిసి పోయాయి. వినియోగదారులు, సందర్శుకులు సుమారు 30 వేల మంది హాజరయ్యారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ఎం.జె. అక్బర్, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి ఈటేల రాజేందర్, నీతి అయోగ్ సలహాదారు అశోక్ జైన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

    

నగదు రహిత లావాదేవిలపై అవగాహనా కల్పించేందుకు బుధవారం పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర ప్రభుత్వం – నీతి అయోగ్ సంయుక్తంగా మేళాను నిర్వహించాయి. వివిధ శాఖలు, ప్రైవేటు సంస్థలు 82 స్టాల్స్ ఏర్పాటు చేశాయి. అత్యధిక సంఖ్యలో 32 బ్యాంకులు తమ తమ స్టాల్స్ ఏర్పాటు చేసి వినియోగదారులకు అవగాహన కల్పించాయి. మేళాలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రం ద్వార, యు.ఎస్.ఎస్.డి (USSD), యు.పి.ఎ (UPA) సేవలను అధికంగా సందర్శకులు వినియోగించుకున్నారు. వీటితో పాటు రైతులకు ఫెర్టిలైజర్స్, సీడ్స్ సంస్థలు నగదు రహిత లావాదేవీల పై స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాయి. సుమారు 5000 వేల మంది వివిధ స్టాల్ల్స్ ద్వార నగదు రహిత లావాదేవీలు జరిపారు. ఒక్క చేనేత స్టాల్ లోనే లక్ష రూపాయల లవాదేవిలు జరగడం మేళా ప్రాధాన్యతను గుర్తు చేసింది. మహిళా సంఘాల ఉత్పత్తులు, పేటీఎం, రూపే తదితర స్టాల్స్ ద్వారా వినియోగదారులు నగదురహిత లావాదేవీలు జరిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఎం.జే అక్బర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల పై చేస్తున్న కృషిని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని సూచించారు. మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు ఇతర అధికారులు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్. సురేశ్ చంద, యుఐడిఎఐ డిప్యూటీ డైరెక్టర్ ఎం.వి.ఎస్. రామిరెడ్డి, మీ-సేవా కమిషనర్ జి.టి. వెంకటేశ్వరరావు,
హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జ, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, సెలబ్రిటీలు ద్రోణాచార్య అవార్డు గ్రహిత నాగపురి రమేష్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైన జైస్వాల్ పాల్గొనగా సాఫ్ట్ నెట్ సీఈవో శైలేష్ రెడ్డి వందన సమర్పణ చేశారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు నిర్వహించగా టీవీ యాంకర్ “బిత్తిరి సత్తి” మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
2వ రోజు మేళా:

—————

రాష్ట్ర ప్రభుత్వం – నీతి అయోగ్ సంయుక్తంగా హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజాలో బుధవారం ప్రారంభం అయినా “డిజీ ధన్ మేళ” గురువారం కూడా కొనసాగానున్నందని సాఫ్ట్ నెట్ సీఈఓ శైలేష్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఈ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మేళా నిర్వహింపబడుతోందన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail