Browse By

మన టివి( సాప్ట్ నెట్) ద్వారా నీట్, యంసెట్ విద్యార్దులకు కోచింగ్- మంత్రి కెటి రామారావు

మన టివి( సాప్ట్ నెట్) ద్వారా నీట్, యంసెట్ విద్యార్దులకు కోచింగ్ ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రసారాలను జనవరి రెండో తేది నుండి ప్రారంభిస్తున్నట్లు మంత్రి కెటి రామారావు తెలిపారు. నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులు పడే తాప్రతయం, విద్యార్దులపైన ఉండే ఒత్తిడిని దూరం చూసేందుకు నిపునులైన అధ్యాపకుల చేత ఈ కార్యక్రమాలను తయారు చేసినట్లు మంత్రి తెలిపారు. మన టివి ద్వారా నిరుద్యోగ యువకుల కోసం రూపొందించిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని, సూమారు 30 లక్షల మంది విద్యార్దులు యూట్యూబ్ లో చూసారని, 20 వేలకి పైగా సబ్ స్క్రైబ్ చేసుకున్నారని తెలిపారు. ఈ స్పూర్తి తోనే నీట్, యంసెట్ పరీక్షలకు ఉపయోగపడే సమారు 540 గంటల కంటెంట్ తయారు చేసినట్లు రోజుకు 6 గంటల పాటు ఈ ప్రసారాలుంటాయని తెలిపారు. ప్రముఖ విద్యావేత్త, యంసెట్ గురు చుక్కారామయ్య సలహాలు, సూచనలు, మార్గదర్శనంలో సాగుతున్న కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. ప్రభుత్వం టెక్నాలజీని వాడుకుని పేద విద్యార్దులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అత్యుత్తమ ప్రమాణాల విద్యను అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. తర్వరలోనే మనటివి ద్వారా మరిన్ని విద్యా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాలను ఫెస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ల ద్వారా అందుబాటులో ఉంటాయని, వీటిని ఉపయోగించుకోవలన్నారు. ఈ సందర్భంగా మంత్రి, చుక్కారామయ్యతో కలిపి సాప్ట్ నెట్ వెబ్ సైట్ ను ప్రారంభించారు. 

చుక్కా రామయ్య
ప్రభుత్వం చేపట్టిన ఈ విద్యాకార్యక్రమాల ప్రసారాలను ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అభినందిచారు. విద్యారంగాన్ని టెక్నాలజీని కలిపినప్పుడు అనేక అద్బుతాలు చేయవచ్చనన్నారు. టెక్నాలజీ తెలిసినవారు పాలకులు అయితే కలిగే ప్రయోజనాలు మంత్రి కెటియార్ ను చూస్తే అర్దం అవుతుందన్నారు. డిజిటల్ నాలెడ్జ్ ను ఉపయోగించుకుని మనిషి ప్రగతి సాధించవచ్చని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్దుల కోసం ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ అవకాశాన్ని విద్యార్దులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠాలు భోధిస్తున్న అధ్యాపకుల్లో చాల మంది తన శిష్యులే ఉన్నట్లు, వారందరికి విస్ర్తతమైన అనుభవం ఉందన్నారు. గ్లోబల్ మార్కెట్ ను అందుకోవాలంటే టెక్నాలజీ అధారంగా విద్యాభోధన జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మానవ వనరుల అభివృద్ది కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని , ముఖ్యమంత్రిని అభినందించారు.

 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail