Browse By

కువైట్ లో చిక్కుకున్న తెలంగాణ వాసికి మంత్రి కెటియార్ సహకారం

కువైట్ లో కేసులో చిక్కుకున్న చిప్ప మనోహర్
• మనోహర్ కు కాన్సర్ కష్టాలు

• దేశానికి రప్పించేందుకు మంత్రి ప్రత్యేక చొరవ, చికిత్స కోసం హమీ

• మంత్రి చొరవతో రేపు హైదరబాద్ కు రానున్న మనోహర్ 

పొట్ట కూటికోసం కువైట్ లో కూలీ పని చేసుకుంటున్న తెలంగాణ వాసికి ఎదురైన కష్టాలకు మంత్రి కెటి రామారావు చొరవతో స్వాంతన లభించింది. మంత్రి కువైట్ లో చిక్కుకున్న సిరిసిల్లా జిల్లవాసి చిప్ప మనోహర్ కు ఏన్నారై శాఖ మంత్రి చేయూత అందించారు. అక్కడిసిల్లా జిల్లా కోనరావు పేట్ మండలం, నిమ్మపల్లి కి చెందిన మనోహర్ కూలీ పని కోసం కువైట్ వెళ్లారు. అయితే వెళ్లిన మనోహర్ కు కాన్సర్ వ్యాది సోకినట్లు నిర్దరణ అయ్యింది. దీంతో కువైట్లోని షెక్ బద్రియా అసుపత్రిలో చేరడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మనోహర్ కుటుంబం ప్రబుత్వ సహయం కోరింది. అక్కడ అసుపత్రిలో మనోహర్, ఇక్కడ కుటుంబం తీవ్ర మానసిక వేధనకు గురయ్యారు, ఈ విషయం తనకు తెలసిన వేంటనే మంత్రి వేగంగా స్పందించారు. మంత్రి తెలంగాణ ఏన్నారై శాఖ అధికారులతో మాట్లడిన మంత్రి, భాదితున్ని వేంటనే తెలంగాణకు రప్పించాలని, ఈమేరకు విదేశి వ్యవహాల శాఖ అధికారులతో మాట్లాడాలని అదేశించారు. 


కువైట్ లో మనోహర్ మీద ఒక కేసు పెండింగ్ ఉండటం, 19 లక్షల పరిహారం చెల్లిస్తేనే స్వదేశం పంపిస్తామని అక్కడి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి చోరవతో అక్కడి ఏన్జీవోల సహకారంతో కువైట్ అధికారులు కేసునుంచి విముక్తి కల్పించారు. తెలంగాణ ఏన్నారై శాఖ అధికారుల ప్రత్యేక కృషితో మనోహర్ రేపు హైదరాబాద్ కు తీసుకుని రానున్నారు. కాన్సర్ చికిత్స కోసం నిమ్స్ లో అన్ని ఎర్పాట్లు చేయలాని అధికారులకు మంత్రి అదేశించారు. రేపు హైదరాబాద్ రాగానే మనోహర్ నిమ్స్ లో చికిత్స అందించనున్నారు. మనోహర్ హస్పిటల్ తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యాన్ని ఎర్పాటు చేశారు. ప్రవాస భారతీయులకు ఎలాంటి కష్టం ఉన్నా తెలంగాణ ఏన్నారై శాఖ 040-23220603, లేదా so_nri@telangana.gov.in ఈ మెయిల్ చేయాలని మంత్రి కోరారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail