Browse By

చేనేత వస్ర్తాలకు చేయూత

చేనేత వస్ర్తాలకు చేయూతనిచ్చేందుకు కలసి రావాలని ప్రజా ప్రతినిధులకు చేనేత, టెక్స్ టైల్ శాఖ మంత్రి కెటి రామారావు కోరారు. ఈరోజు శాసన సభ, శాసన మండలిలో స్పీకర్, చైర్మన్, మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలను మంత్రి కెటి రామారావు స్వయంగా కలిసారు. తెలంగాణ రాష్ర్ట హ్యండ్ లూమ్ కోపరేటివ్ సోసైటీ ( టెస్కో) సంస్ద తయారు చేసిన చేనేత వస్ర్తాలను వారికి అందజేశారు. 



శాసన సభలో స్పీకర్ మధుసూదనాచారిని ఆయన చాంబర్లో కలిసారు. స్పీకర్ తోపాటు డిప్యూటీ సియంలను, మంత్రులకు టెస్కో వస్ర్తాలను అందజేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులను అదుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని, చేనేత వస్ర్తాల వినియోగం కోసం చేనేత లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెలకు తొమ్మది నెలల పాటు నెలకు వెయ్యి రూపాయాలు పొదుపు చేస్తే పదో నెలలో 14,400 విలువైన చేనేత వస్ర్తాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ చేనేత లక్ష్మి కార్యక్రమంలో మంత్రులు, వారి ఉద్యోగులను చేరేలా చూసి, చేనేత వస్ర్తాల వినియోగాన్ని పెంచేలా చూడాలన్నారు. ఈ చేనేత వస్ర్తాలను కోనుగోలు చేసేందుకు టెస్కో వెబ్ సైట్లో అవకాశం ఉన్నదని, ఈ వెబ్ సైట్‌ను మరింత అకర్షనీయంగా తయారు చేయాలని మంత్రి టెస్కో అధికారులను అదేశించారు. దీంతోపాటు అమెజాన్, ప్లిప్ కార్ట్ వంటి ప్రధాన అన్ లైన్ స్టోర్లలో టెస్కో వస్ర్తాలు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇక తన పరిధిలో ఉన్న మున్సిపల్, మైనింగ్, పరిశ్రమల శాఖాధిపతులుతో మాట్లాడిన మంత్రి ఖచ్చితంగా వారంలో ఓక రోజు చేనేత వస్ర్తాలు ధరించేలా చూడలన్నారు. ప్రతివారం గ్రీవెన్స్ డే రోజు తమ ఉద్యోగులు చేనేత వస్ర్తాలు ధరించేలా నిర్ణయం తీసుకున్నట్లు జియచ్ యంసీ కమీషనర్ జనార్ధన్ రెడ్డి మంత్రి తెలిపారు. దీంతో ప్రజలకు చేనేత వినియోగంపైన మరింత ప్రచారం లభిస్తుందన్నారు. 

మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేనేత వస్ర్తాలు వినియోగించడం ద్వార మంచి సందేశం వెలుతుందన్నారు. మంత్రి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించిన మంత్రులు, ప్రధాన ప్రతి పక్షనేతలు అభినందించారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail