Browse By

జూబ్లీహిల్స్‌లో యోయో టీవీ ప్రారంభం

డిజిటల్ మీడియాలో సంచలనం యోయో టీవీ. అమెరికాలోని న్యూజేర్సీ వేదికగా ప్రవాస భారతీయుల గొంతుకను వినిపిస్తున్న ఏకైక ఛానల్ యోయో టీవీ. ఎన్నారై వార్తలతో పాటు సినీ, రాజకీయ, గాసిప్స్,బ్రేకింగ్,ఎంటర్‌టైన్ మెంట్ వార్తలను అందిస్తు అనతి కాలంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది యోయో టీవీ. వెబ్ మీడియాలో సంచలనంగా మారిన యోయో…టీవీ ప్రసారాలు ఇప్పుడు హైదరాబాద్‌ లో ప్రారంభమయ్యాయి. నగరంలోని జూబ్లీహిల్స్‌లో యోయో టీవీ కార్పొరేట్ ఆఫీస్‌, స్టూడియోను టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్‌ ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జ్యోతి ప్రజ్వాళన చేసి సంతోష్ కుమార్ ప్రారంభించారు.

అనతికాలంలోనే నెటిజన్లతో పాటు ప్రేక్షకుల ఆదారాభిమానాలను పొందిన యోయో టీవీ మరింత ముందుకు వెళ్లాలని సంతోష్ కుమార్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యోయో టీవీ ఛైర్మన్ మల్లారెడ్డి, టీ న్యూస్ ఎండీ నారాయణరెడ్డి, జీఎం ఉపేందర్, టీడీఎఫ్ అధ్యక్షుడు కల్వల విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 ఇక ఇటీవలె న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో యోయో టీవీ సౌజన్యంతో తెలంగాణ గుండెచప్పుడుగా ఉద్యమంలో పుట్టి, ఉద్యమంతో సాగి, తెలంగాణ ఏర్పాటులో కీలక భూమి క పోషించిన ‘టీన్యూస్’ చానెల్ ప్రసారాలు అమెరికాలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail