Browse By

ఉస్మానియాలో కిడ్నీ, లివర్ టవర్స్ ని ఏర్పాటు చేస్తాం

ఉస్మానియా మెడికల్ కాలేజీ అలుమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్ ముగింపు సమావేశంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. నిన్న, నేడు రెండు రోజులుగా ఉస్మానియా మర్దికల్ కాలేజీ ఆడిటోరియంలో కొనసాగుతున్న గ్లోబల్ మీట్

మంత్రి లక్ష్మారెడీ కామెంట్స్:

తెలంగాణ వచ్చాక వైద్య రంగం వినూత్న ప్రగతి సాధిస్తున్నది

అంతకు ముందు నిర్లక్ష్యానికి గురైన వైద్య రంగ0 గాడిలో పడింది

ఉస్మానియాలో త్వరలో కొత్త భవనానికి శంకుస్థాపన సీఎం కెసిఆర్ చేతుల మీదుగా జరగబోతున్నది
అవసరమైన డిజైన్లు సిద్ధం చేశాము


సీఎం కెసిఆర్ ఆమోదం పొందిన వెంటనే శంకుస్థాపన ఉంటుంది
ఉస్మానియా కొత్త భవన నిర్మాణంలో అవాంతరాలన్ని తొలగించినం
ఉస్మానియా పాత చారిత్రక భవనాలకు ఇబ్బందులు లేకుండానే కొత్త భవనాలను నిర్మిస్తాం
ఉస్మానియాలో కొత్త భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు, నిధులు సిద్ధంగా ఉన్నాయి
ఉస్మానియాలో ఈ మధ్య జరిగిన, జరుగుతున్న కిడ్నీ , లివర్, పాంక్రియటిస్ వంటి అవయవ మార్పిడులు ప్రభుత్వ రంగంలో ఆసియాలొనే అరుదైనవి
ఉస్మానియాలో కిడ్నీ, లివర్ టవర్స్ ని ఏర్పాటు చేస్తాం
ఉస్మానియాలో త్వరలో ఆధునిక అన్ని వసతులతో కూడిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ని ఏర్పాటు చేస్తాం
ఉస్మానియాలో అవయవ మార్పిడి కేంద్రాన్ని మరింత అభివృద్ధి పరుస్తాం, అలాగే అవయవ మార్పిడులు, తదితర శస్త్ర చికిత్సల తర్వాత రోగులకు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ని పూర్తి ఉచితంగా అందచేస్తాం
వైద్య రంగంలో ఉస్మానియా ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు స్వీకరించింది
వైద్యంలో ఉస్మానియా సాధించిన ప్రగతి అనుపమానం, నిరూపమానం
రూ.12కోట్ల నిధులతో ఉస్మానియా లో వైద్య పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పుబోతున్నాం
ఉస్మానియా వైద్య విద్యార్థుల కోసం 5 ప్రత్యేక బస్సులను అందచేస్తున్నాం.
అవన్నీ ఉస్మానియా, డెంటల్ వంటి వివిధ విభాగాలకు అందుబాటులో ఉంటాయి
వైద్యం మానవీయ కోణంలో జరగాల్సిన అవసరం ఉంది అందుకే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చికిత్స తీసుకుంటూ అనేక మంది చనిపితున్నారు. అలాంటి డెడ్ బాడీస్ ని వాళ్ళ ఇళ్లకు చేర్చడానికి ప్రభుత్వం పార్థివ వాహనాలను ఏర్పాటు చేసింది
పార్థివ వాహనాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది
నానక్ రామ్ గూడా వంటి సంఘటనలో మనవతా దృక్పథంతో ఆంధ్ర రాష్ట్రానికి కూడా డెడ్ బాడీస్ ని పంపించాము
ఆన్ వాంటెడ్ ఊరేషన్స్ ని నిరోధించాలి. ఈ అంశం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది
కొన్ని ఊళ్లకు ఊళ్లే ఇలాంటి శస్త్ర చికిత్సలు జరిగాయి
మహిళలకు ఇలాంటి శస్త్ర చికిత్సల వల్ల వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం
ఇలాంటి అన్ వాంటెడ్ శస్త్ర చికిత్సలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వైద్యుల మీద ఉంది
రోగ నిరోధక చర్యల మీద ప్రభుత్వo దృష్టి సారించింది
రోగాలను అరికట్టడానికి ముందస్తు పరీక్షలను చేస్తున్నది
రోగ నిర్ధారణ కేంద్రాలు, డియాలసిస్, కాన్సర్ కేంద్రాల విస్తరణ మీద చర్యలు తీసుకుంటున్నాం
సీఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ తో ఆరోగ్య తెలంగాణ సాధనకు నడుం బిగించారు మంత్రి లక్ష్మారెడ్డి
సీఎం ప్రోత్సాహం వల్లే ఆరోగ్యశాఖ అనూహ్య ప్రగతి సాధిస్తున్న ది
హైదరాబాద్ చుట్టు ముట్టు మరికొన్ని హాస్పిటల్స్ ని ఏర్పాటు చేస్తున్నాం
ప్రభుత్వం చేప్పట్టిన చర్యల కారణంగా 20 శాతం ఓపి పెరిగింది
ప్రతిభ కనబర్చిన పలువురు వైద్యులను సన్మానించిన మంత్రి లక్ష్మారెడ్డి
అలుమ్ని డైరీ ని ఆవిష్కరించిన మంత్రి లక్ష్మారెడ్డి
ఈ గ్లోబల్ మీట్ లో పాల్గొన్న omcaa అధ్యక్షుడు డాక్టర్ మోహన్ గుప్త, Dme డాక్టర్ రమణి, ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ gvs మూర్తి, ఉస్మానియా పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు తదితరులు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail