Browse By

డోనాల్డ్ ట్రంప్ భార‌తీయుల‌కు షాక్

 డోనాల్డ్ ట్రంప్ భార‌తీయుల‌కు షాక్ ఇచ్చారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్‌1బీ వీసా ఉన్న‌వాళ్ల‌ను తీసుకోబోమ‌న్నారు. భార‌తీయుల‌తో పాటు ఇత‌ర కార్మికుల‌కు కూడా ట్రంప్ నిర్ణ‌యం విఘాతంగా మారే అవ‌కాశాలున్నాయి. ఐయోవాలో జ‌రిగిన ర్యాలీలో పాల్గొన్న అమెరికా కాబోయే అధ్య‌క్షుడు ట్రంప్ విదేశీ వ‌ర్క‌ర్ల‌పై భిన్న అభిప్రాయాన్ని వినిపించారు. డిస్నీ వ‌ర‌ల్డ్‌, అమెరికా కంపెనీల‌కు విదేశీయుల‌ను రిక్రూట్ చేయబోమ‌న్నారు. ప్ర‌తి అమెరికా పౌరుడికి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు పోరాటం సాగిస్తానన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మయంలో ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్ల‌తో మాట్లాడిన‌ట్లు ట్రంప్ తెలిపారు. అమెరిక‌న్ల స్థానంలో విదేశీ ఉద్యోగులను నియ‌మించ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail