Browse By

దేశంలోనే తొలి నగదురహిత లావాదేవీల రాష్ట్రంగా తెలంగాణను మారుద్దాం

కొల్లాపూర్ ను క్యాష్ లెస్ నియోజకవర్గంగా మారుద్దాం
• నగదు రహిత లావాదేవీలతో లాభాలెన్నో ఉన్నాయి.

• జనవరి 10 నుంచి ఆసరా ఫించన్లు, ఉపాధికూలీలకు వేతనాన్ని ఆన్ లైన్ ద్వారానే చెల్లిస్తాం.

• ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఆధార్ తో ఖాతాను అనుసంధానం చేసుకోవాలి.

• గ్రామ పంచాయతీలు, మహిళాసంఘాల వద్ద స్వైపింగ్ మిషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

• త్వరలోనే వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగిన నియోజకవర్గంగా కొల్లాపూర్ ను మారుద్దాం.

• కొల్లాపూర్ లో నగదు రహిత లావాదేవీలు, వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన సదస్సులో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, భారీగా హాజరైన మహిళాసంఘాల ప్రతినిధులు.


కొల్లాపూర్ (నాగర్ కర్నూల్): దేశంలోనే 100 శాతం నగదురహిత లావాదేవీలు జరుగుతున్న తొలి రాష్ట్రంగా తెలంగాణను మారుద్దామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై శుక్రవారం కొల్లాపూర్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దాదాపు 5 వేల మంది మహిళసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మహిళల భాగస్వామ్యం ఉంటే ఏ కార్యక్రమైన విజయవంతం అవుతుందని మంత్రి జూపల్లి అన్నారు. నగదు రహిత లావాదేవీలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకునేందుకు మహిళాసంఘాలను పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేసేందుకు కార్యచరణ సిద్ధం చేశామన్నారు. 100 శాతం నగదు రహిత లావాదేవీలతో కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా మార్చేందుకు సహకరించాలని మహిళాసంఘాలను మంత్రి కోరారు.
​నగదురహిత లావాదేవీల వల్ల అనేక లాభాలున్నాయని.. వాటిపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నల్లధనాన్ని, అవినీతిని అరికట్టేందుకు నగదురహిత లావాదేవీలు దోహదపడతాయన్నారు. అదేవిధంగా సమయాన్ని కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో కరెన్సీ నోట్లకు బదులుగా మొబైల్ ఫోన్లు., స్వైపింగ్ మిషన్లు, ఏటీఎం కార్డులనే పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారన్నారు. బ్యాంక్ ఖాతాలు లేని వారికి అధికారులే గ్రామాల్లోకి వచ్చి ఖాతాలు తెరిపించేందుకు కార్యచరణ సిద్ధం చేశామన్నారు. జనవరి 10 లోపు ప్రతి ఒక్కరు ఆధార్ లింకేజీతో కూడిన ఖాతాలు ప్రారంభించాలని, రూపే కార్డలను అక్టివేట్ చేసుకోవాలని సూచించారు. మరోవైపు గ్రామాపంచాయతీల్లో, మహిళాసంఘాల వద్ద స్వైపింగ్ మిషన్ లను ఉంచేందుకు ఆలోచిస్తున్నామన్నారు.


అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణంలోను మహిళాసంఘాలు చొరవ తీసుకుని , ఏ గ్రామానికి ఆ గ్రామంలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. 2018 అక్టోబర్ 2 లోగా తెలంగాణలో 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మహిళాసంఘాలు ఇందులోను క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. మరుగుదొడ్లు లేని వారి జాబితాలు అందజేస్తే వారికి అడ్వాన్స్ గా స్త్రీ నిధి బ్యాంక్ ద్వారా 8వేల రూపాయల లోన్ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే మ్యాజిక్ సోక్ పిట్ నిర్మాణం కోసం మరో 4 వేలను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, ఉపాధిహామీ ద్వారా ఈ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకుపోయేందుకు పంచాయతీరాజ్ శాక కృషి చేస్తుందన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు 100 శాతం నగదు రహిత లావాదేవీలు, 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్లు శ్వేతా మహంతి, శ్రీధర్, స్త్రీ నిధి డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగదు రహిత లావాదేవీలపై మహిళాసంఘాల ప్రతినిధులక వివిధ బ్యాంకుల అధికారులు అవగాహన కల్పించారు.  

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail