Browse By

ఆర్ టి సి బస్ డిపోలలో మినీ ధియేటర్ల ఏర్పాటు?

 తెలంగాణ రాష్ట్రంలో సినిమారంగంలో ఇచ్చే అవార్డులను వచ్చే ఉగాదిన ప్రధానం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,పాడిపరిశ్రమాభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళ వారం సచివాలయంలో చలన చిత్రరంగ పరిశ్రమకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి రమణాచారి,సమాచార పౌర సంబంధాలశాఖ కమీషనర్ శ్రీ నవీన్ మిత్తల్, జెఎండి శ్రీ కిషోర్ బాబు, ఈడి శ్రీ రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.

 

   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై రమణాచారి గారి అధ్యక్షతన ఏర్పడిన సబ్ కమిటి ఇప్పటికే రెండు మార్లు సమావేశమయ్యారని అన్నారు. సినిమా అవార్డులు, సింగిల్ విండో క్లియరెన్స్, ఆన్ లైన్ టికెటింగ్, మినీ కల్చరల్ సెంటర్లు, చిన్నతరహా చిత్రాల 5వ షో,చిత్ర పురికాలనీకి సౌకర్యాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి గారితో చర్చించి వచ్చే జనవరిలో నిర్ణయాలు ప్రకటించనున్నట్లు మంత్రి వెళ్ళడించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారు హైదరాబాద్ నగరాన్ని సినిమా హబ్ గా మార్చాలన్న ఆలోచన ఉందని, దాని కనుగుణంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందన్నారు. పూనే తరహాలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ను అంతర్జాతీయ స్ధాయిలో నిర్మించడానికి అవసరమైన స్ధలాన్ని కేటాయించడానికి అధికారులు క్షేత్ర స్ధాయిలో పరిశీలించాలన్నారు. ఆన్ లైన్ టికెటింగ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని ఎఫ్.డి.సి ద్వారానే జరిగే విధంగా చేసి సందేశాత్మక, బాలల, చారిత్రాత్మక చిత్రాలకు సబ్సిడీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు.

 

    తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవార్డుల పేరు, పారితోషికం, జాతీయ అవార్డుల పేరు ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సినిమారంగ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి సినిమా రంగంలోని ప్రముఖుల అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆర్ టి సి బస్ డిపోలలో మినీ ధియేటర్ల ఏర్పాటుకు సంబంధించి సంబంధిత మంత్రి, ఛైర్మన్,యండిలతో త్వరలోనే సమావేశం కానున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail