Browse By

గాలికుంటూ వ్యాధి నివారణ పై  జిల్లా పశుసంవర్ధక అధికారులతో రాష్ట్ర స్థాయి సదస్సు

గాలికుంటూ వ్యాధి నివారణ పై  జిల్లా పశుసంవర్ధక అధికారులతో రాష్ట్ర స్థాయి సదస్సు

 

గాలికుంటూ వ్యాది రహిత రాష్ట్రంగా తెలంగాణా రాష్ట్రం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు పశు సంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయం , హైదరాబాద్ నందు తేది 28.11.2016 నాడు నిర్వహించబడినది .


ఈ సదస్సుకు ముఖ్య అతితిదిగా హాజరైన పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. డి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ … గత కొన్ని సంవత్సరాలుగా పశు సంవర్ధక శాఖ క్షేత్ర స్తాయి సిబ్బంది క్రమానుసారం , ప్రణాళిక బద్దంగా పశువులలో ఉచిత గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాలు సమవర్తవంతంగా నిర్వహించడం వలన తెలంగాణా రాష్ట్రము లో గత ( 3 ) సంవత్సరాలుగా పశువులలో గాలికుంటూ వ్యాధిప్రబల లేదు. తదనుగుంగా మన రాష్ట్రాన్ని గాలికుంటువ్యాధి రహిత రాష్ట్రంగా దేశములోనే ప్రప్రథమంగా ప్రకటించడం జరిగినది . అంతేగాక అంతర్జాతీయ పశు ఆరోగ్య సంస్థ చే మన రాష్ట్రం గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా గుర్తించ బడినప్పుడే మన రాష్ట్ర పశూత్పతులకు ఎగుమతుల అవకాశాలు ఎక్కువయి అదేవిదంగా వాటి విలువ అధికమై రైతులకు పశుపోషణ ఎన్నో లాభాలను చేకూర్చుతుంది. అందుకు జిల్ల పశు వైద్య మరియు పశు సంవర్ధక అధికారులు మరియు క్షేత్ర స్తాయి అధికారులు ఈ సదస్సు ద్వారా నిపుణులు అందించిన సూచనలు తప్పక పాటించి, తెలంగాణా రాష్ట్రాన్ని గాలికుంటూ వ్యాధి రహిత రాష్ట్రంగా అంతర్జాతీయ పశు ఆరోగ్య సంస్థ ద్వారా గుర్తింపు పొందడానికి ప్రతి ఒక్కరు క్షేత్ర స్తాయిలో అంకిత భావంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రామానికి ప్రారంభోపాన్యాసం చేసిన డా.వి.లక్ష్మారెడ్డి అదనపు సంచాలకులు గారు , అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, పశువులలో గాలికుంటు వ్యాధిని సమర్థవంతంగా అరికట్టడానికి మన రాష్ట్రం అన్ని వనరులు కలిగి ఉన్నదని , ఈ సదస్సులో నిపుణలు అంతర్జాతీయ స్తాయిలో గాలికుంటూ వ్యాధి రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి తగు సలహాలు సూచనలు అందచేస్తారని తెలిపారు. వాటిని పాటించి మన రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో గాలికుంటూ రహిత రాష్ట్రంగా గురింపు పొందడానికి కృషి చేయాలని కోరారు.
ఈ సదస్సులో అల్లాన సంస్థ డైరెక్టర్ డా . తోట మరియు శాస్త్ర వేత్తలు డా. కొండయ్య , డా నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డా కృష మోహన్ సంయుక్త సంచాకులు వి బి ఆర్ ఐ గారి ఆద్వర్యములో నిర్వహించిన ఈ సదస్సుకు అన్ని జిల్లాల నుండి జిల్లా పశు సంవర్ధక అధికారులు , ఎ డి డి ఎల్ అధికారులు , పశువైద్యాదికారులు పాల్గొని జయప్రదం చేసినారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail