Browse By

కేంద్ర హోం మంత్రి కి గోల్కొండ చిత్రపటం బహుకరించినరాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు

కేంద్ర హోం మంత్రి కి గోల్కొండ చిత్రపటం బహుకరించినరాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు

 

తెలంగాణా రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు గోల్కొండ కోట చిత్రపటాన్ని హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీ ఆవరణలో బహుకరించారు. హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జరిగిన అన్ని రాష్ట్రాల డిజిపి ల సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్య అతిధిగా కేంద్ర హోం మంత్రి పాల్గొన్న విషయం విదితమే. ఈ సందర్భంగా, రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారుల పనితీరును ఆయన ప్రశంసించారు.


 తీవ్రవాద, ఉగ్రవాద సంబంధిత సమాచార సేకరణ మరియు నిరోధంలో రాష్ట్ర ఇంటలిజెన్స్ శాఖ సమర్ధంగా పనిచేస్తోందని కేంద్ర హోం మంత్రి కొనియాడారు. దేశవ్యాప్తంగా జరిగిన పలు సంఘటనల నేపధ్యంలోని దర్యాప్తు లో రాష్ట్ర ఇంటలిజెన్స్ శాఖ కీలక పాత్ర వహించిందని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా, ఇంటలిజెన్స్ లో ARSI గా పనిచేస్తున్న ముక్తార్ వేసిన గోల్కొండ కోట చిత్రపటాన్ని డిజిపి అనురాగ్ శర్మ సమక్షంలో ఇంటలిజెన్స్ ఐజిపి లు నవీన్ చంద్, వి.సి. సజ్జనార్, డిఐజి రాజేష్ కుమార్ తదితరులు కేంద్ర హోం మంత్రికి బహుకరించారు. అదే విధంగా, ముక్తార్ వేసిన కేంద్ర హోం మంత్రి చిత్రపటాన్ని సైతం ఆయనకు బహుకరించారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail