Browse By

వైద్య శాఖ పనితీరు మీద ఆరోగ్య మంత్రి లక్ష్మా రెడ్డి సమీక్ష

అందరు మెచ్చే…అమ్మ ఒడి…పాత భవనాలకు వెంటనేమరమ్మతులు…త్వరలో కొత్త sanitation విధానం…బెస్ట్ స్కీం కొత్త బెడ్ షీట్స్…పకడ్బందీగా పార్థివ వాహనాలు…వైద్య శాఖ పనితీరు మీద సమీక్ష

అధికారులకు పలు సూచనలు చేసిన వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మా రెడ్డి

హైదరాబాద్ : ఉద్యోగుల, జర్నలిస్టుల హెల్త్ కార్డుల పథకం మీద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మా రెడ్డి సమీక్షించారు. కాబినెట్ భేటీ అనంతరం సచివాలయంలోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం త్వరలో చేపట్టబోయే వెల్నెస్ సెంటర్స్ ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముందుగ ఖైరతాబాద్లో వెల్నెస్ సెంటెర్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు భవన నిర్మాణం పనులు, సెంటర్లో అవసరం ఐన మందులు, సిబ్బంది, ఫర్నిచర్, వైద్య పరికరాలు, ఇతర ఏర్పాట్లన్నీ పక్కాగా జరగాలని ఆదేశించారు. ఉద్యోగుల, జర్నలిస్టుల హెల్త్ కార్డుల మీద ఇచ్చే వైద్య సేవలు అత్యంత పకడ్బందీగా జరగాలని ఆదేశించారు. ఉద్యోగుల, జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలో సీఎం కెసిఆర్ సైతం ఆసక్తిగా ఉన్నారని, సీఎం అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని మంత్రి చెప్పారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సంబంధిత అధికారులకి సూచించారు.


అందరు మెచ్చే…అమ్మ ఒడి…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని త్వరలో ప్రారంభించబోతున్న అమ్మ ఒడి కార్యక్రమ రూపకల్పన మీద మంత్రి లక్ష్మారెడ్డి చర్చించారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నామని, గర్భిణీలకు ప్రభుత్వ వైద్య శాలల్లోనే ఆపరేషన్లు లేని, సుఖ ప్రసవాలు చేయాలనీ మంత్రి సూచించారు. మొత్తం ప్రసవాలలో సగం ప్రభుత్వ వైద్య శాలల్లోనే జరగాలని చెప్పారు. ప్రసవాలకు ఆధునిక ప్రసవ గదులను నిర్మించాలన్నారు. 108 వాహనం ద్వారా గర్భిణీలను వైద్య శాలలకు తీసుక రావాలన్నారు. ప్రసవానంతరం బాలింత, బేబీ, అటెండెంట్ లని అమ్మ ఒడి వాహనం ద్వారా వాళ్ళ ఇళ్లకు ఉచితంగా చేర్చాలన్నదే ప్రభుత్వ అభిమతం అన్నారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించాలని అందుకు ఏర్పాట్లు పూర్తీ చేయాలనీ మంత్రి ఆదేశించారు.

పాత భవనాలకు వెంటనే మరమ్మతులు…

వైద్య శాలల పాత భవనాల మరమ్మతులు వెంటనే పూర్తీ చేయాలనీ మంత్రి అధికారులకు సూచించారు. ఇప్పటికే రూ.35 కోట్లు మంజూరయ్యాయని, వాటిని అత్యవసరంగా మరమ్మతు చేయాల్సిన హాస్పిటల్స్ కి వినియోగించాలని మంత్రి చెప్పారు.

త్వరలో కొత్త sanitation విధానం…

ప్రస్తుతం ఉన్న sanitation కంటే మెరుగైన విధాన రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాల ల్లో సహజంగా ఉండే sanitaion సమస్యలు లేకుండా, క్లీన్ అండ్ గ్రీన్ పద్ధతిలో ఉండాలని మంత్రులు సూచించారు. విధి విధానాల మీద మంత్రి అధికారులకి పలు సూచనలు చేశారు.


పకడ్బందీగా పార్థివ వాహనాలు…

ఈ మధ్యే ప్రారంభించిన పార్థివ వాహనాల పని తీరుని కూడా మంత్రి సమీక్షించారు. పార్థివ వాహనాలు ఎక్కడెక్కడి కి, ఎంత దూరం ప్రయనిస్తున్నది?, ప్రజలకు అందుబాటులో ఉన్నాయా? సమస్యలు ఏమైనా వస్తున్నాయా? వస్తే, వాటిని ఎలా అదిగమించాలన్న అంశాల మీద మంత్రి లక్ష్మారెడ్డి అధికారులకు సూచనలు చేశారు. పార్థివ వాహనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అమలు తీరు మంచిగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
బెస్ట్ స్కీం కొత్త బెడ్ షీట్స్…

వైద్య శాలల్లో ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న రంగుల కొత్త బెడ్ షీట్స్ మీద కూడా మంత్రి సమీక్షించారు. కొత్త బెడ్ షీట్స్ ఎలా ఉన్నాయి? వాటిని సరిగా మారుస్తున్నారా ? లేదా? రోగుల స్పందన ఎలా ఉంది? వంటి ఫీడ్ బ్యాక్ తీసుకోవడమే గాక, ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చే ఇలాంటి పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకి మంత్రి లక్ష్మా రెడ్డి సూచించారు.
ఈ సమీక్షలో కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమణి, హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, నిమ్స్ సంచాలకులు డాక్టర్ కే మనోహర్, ఆరోగ్యశ్రీ ఉద్యోగుల, జర్నలిస్టుల హెల్త్ కార్డుల సీఈఓ డాక్టర్ కల్వకుంట్ల పద్మ, tsmsidc చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail