Browse By

డెంగీ వ్యాధి వ్యాప్తి మీద సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్న డెంగీ వ్యాధి మీద సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో సంబంధిత ఉన్నత అధికారులతో సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి

 • రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు వ్యాధి తీవ్రంగా ఉన్న ఖమ్మం జిల్లా బోనకల్ తదితర గ్రామాల పై ప్రత్యేక చర్చ
 • డెంగీ వ్యాధి నివారణ కు, తాజా పరిస్థితుల మీద అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి
 • ఖమ్మం జిల్లాలోని బోనకల్, రావి నూతల, గోవింద పురం గ్రామాలకు హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాన్ని jd ఆధ్వర్యంలో పంపడానికి నిర్ణయం
 • ఆయా గ్రామాల్లో డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యల మీద చర్చ
 • పరీక్షా పరికరాలతో పాటు డాక్టర్లు, సిబ్బందిని పంపడానికి ఆదేశాలు
 • వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న ఖమ్మం జిల్లా బోనకల్, రావి నూతనల, గోవిందపురం, అలపాడు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలి
 • ఆయా గ్రామాలకు సెల్ కౌంట్ మిషన్స్ పంపాలని నిర్ణయం
 • డెంగీ దోమల నివారణకు ముందు జాగ్రత్త చర్య గా జిల్లాలోని అన్ని స్ప్రే లు బోనకల్తరలించాలని నిర్ణయం
 • వారానికి రెండు సార్లు బాధిత ఇళ్ళల్లో స్ప్రే చేయాలి
 • జిల్లా కేంద్రం నుంచి వైద్యుల ప్రత్యేక బృందాన్ని పంపనున్న ప్రభుత్వం
 • ఖమ్మంలోను ప్రత్యేక బృందాలు
 • సీరియస్ కేసులను ఖమ్మం తరలింపు
 • అంతకంటే సీరియస్ కేసులను హైదరాబాద్ కి తరలింపునకు నిర్ణయం
 • డెంగీ వ్యాప్తి చెందిన ప్రతి గ్రామానికి ప్రత్యేక బృందాలు
 • బోనకల్ కి హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ నుండి ప్రత్యేక బృందం
 • గ్రామానికి ఒక్కటి చొప్పున 108 నెంబర్ వాహనాల తరలింపు
 • మూడు 104 వాహనాలను కూడా పంపించాలని నిర్ణయం
 • వ్యాధి పరివ్యాప్తం కాకుండా
 • ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
 • ఖమ్మం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకోవాలి
 • పంచాయతీరాజ్, మంచినీటి సరఫరా తదితర విభాగాల అధికారులతో మాట్లాడి ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం చేపట్టాలి
 • డెంగీ వ్యాధి, సోకడం, వ్యాప్తి చెందడం, నివారణ వంటి పలు అంశాల మీద ప్రజల్లో అవగాహన పెంచాలి
 • ట్రీట్మెంట్ తో పాటు, నివారణ చర్యల మీద దృష్టి పెట్టాలి
 • మంత్రితోపాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, adme, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, dh లలిత కుమారి, dh, ad డాక్టర్ ప్రభావతి, మలేరియా అధికారి సంజీవరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail