Browse By

పరారైన 8మంది ఉగ్రవాదుల హతం

భోపాల్ జైలు నుంచి పరారైన 8మంది సిమి ఉగ్రవాదులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. భోపాల్‌లోని ఓ శివారు గ్రామంలో వీళ్లంతా ఓ ఇంట్లోని వున్నట్లు సమాచారం రావడంతో రంగంలోకి దిగింది యాంటీ టెర్రరిస్ట్ స్క్యాడ్. దీంతో ఇటు సిమీ- అటు పోలీసుల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది సిమి ఉగ్రవాదులు హతమయ్యారు. 

దీపావళి సంబరాలు జరుగుతున్నప్పుడు అందరూ ఏమరుపాటుగా ఉంటారని ముందే గ్రహించి పక్కాగా తమ ప్లాన్ అమలు చేశారు సిమి. ఆదివారం రాత్రి ఓ గార్డును చంపి జైలు నుంచి పారిపోయారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో వీళ్ళు కత్తితో హెడ్ కానిస్టేబుల్ రామ‌శంకర్ గొంతు కోసి జైలు గోడ దూకి పరారయ్యారు. ఈ ఘటనకు సంబందించి అయిదుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. ఇదిలావుండగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భోపాల్‌కి వచ్చి, వెళ్లేదారులపై కన్నేసి తనిఖీలు చేపట్టారు. మూడేళ్ళ క్రితం కూడా ఇక్కడికి సుమారు 280 కి.మీ. దూరంలోని ఖాండ్వా లో ఇదే తరహాలో ఏడుగురు సిమి టెర్రరిస్టులు బాత్ రూమ్ గోడ ధ్వంసం చేసి పారిపోయారు. 

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail