Browse By

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ఫస్ట్

హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానం దక్కించుకుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మొదటి ర్యాంకులో నిలిచింది. 


ఈమేరకు వరల్డ్ బ్యాంకు, కేంద్ర వాణిజ్యశాఖ కలిసి రూపొందించిన ర్యాంకింగ్ జాబితాను ఇవాళ విడుదల చేశారు. 


సులభతర వాణిజ్య విధానంలో 98.78 స్కోర్‌తో తెలంగాణ, ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో గుజరాత్, నాలుగో స్థానంలో ఛత్తీస్‌గఢ్ నిలిచాయి. 5వ స్థానం మధ్యప్రదేశ్, 6వ స్థానం హర్యానా, 7వ స్థానం ఝార్ఖండ్, 8వ స్థానం రాజస్థాన్, 9వ స్థానం ఉత్తరాఖండ్, 10వ స్థానం మహారాష్ట్ర నిలిచాయి. గతేడాది తెలంగాణ 13వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 12 స్థానాలు మెరుగుపడి ఈ యేడాది తెలంగాణ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail