Browse By

కివీస్‌పై భారత్ ఘనవిజయం 

వన్డే సిరీసూ మనదే..
– 190 పరుగుల తేడాతో ధోనీ సేన విక్టరీ

– 23.1 ఓవర్లలోనే న్యూజీలాండ్ ఆలౌట్

– అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ 

భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరు వన్డే వన్ సైడ్ అయిపోయింది. 79 పరుగులకే కివీస్ ఖేల్ ఖతం అయింది. మొదట్నుంచే భారత బౌలర్లు తమ సత్తా చాటారు. పరుగుల ఖాతా తెరవకుండానే మొదటి వికెట్ ను పడగొట్టారు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో మార్టిన్ గప్తిల్ డకౌట్ అయ్యాడు. 28 పరుగుల జట్టు స్కోరు వద్ద లాథమ్(19) రూపంలో రెండో వికెట్‌ను న్యూజిలాండ్ జట్టు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో యాదవ్‌కు క్యాచ్ ఇచ్చిన లాథమ్ ఫెవిలియ్ దారి పట్టాడు. 63 పరుగులు వద్ద జాదవ్ బౌలింగ్ లో పటేల్ కు క్యాచ్ ఇచ్చి విలియమ్స న్(27) వెనుదిరిగాడు. ఆ వెంటనే 3 పరుగులకే టేలర్(19), మరో 3 పరుగులకు వాట్లింగ్(0)ను మిశ్రా పెవిలియన్ కు పంపాడు. 


అనంతరం 74 పరుగుల వద్ద అండర్సన్ ను యాదవ్ డకౌట్ చేశాడు. సరిగ్గా ఒక ఓవర్ తరువాత మరో వికెట్. అండర్సన్ ను యాదవ్ ఎల్బీ చేశాడు. ఆ నెక్స్ట్ బాల్ కే మరో వికెట్. నీషమ్(3) మిశ్రా బౌలింగ్ లో ఔట్. మరో నాలుగు బంతులు, నాలుగో బంతికి సౌతీ డకౌట్. మిశ్రా బౌలింగ్ లో ధోనీ స్టంబ్ చేశాడు. ఆ తరువాత సోధీ(0), శాంట్నర్(4)లు టప టపా. 23.1 ఓవర్లలో ఖేల్ ఖతమయింది. 79 పరుగులకు న్యూజీలాండ్ ఆలౌటయింది. 5 వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 6 ఓవర్లలో 2 మేడ్ ఇన్‌లు, 18 పరుగులిచ్చాడు. ఈ సిరీస్‌లో మొత్తం 15 వికెట్లను పడగొట్టిన మిశ్రా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా దక్కించుకున్నాడు. కుర్రాళ్ల సమిష్టి కృషితో సిరీస్ భారత్ గెలుచుకుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను ఇండియా కౌవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail