Browse By

పురపాలికలకు కేంద్రం నిధులు కోరేందుకు డీల్లీ వెళ్లనున్న మంత్రి కెటియార్

➢ భారీ వర్షాల వలన తెలంగాణలోని పురపాలికల్లో జరిగిన నష్టాన్ని మంత్రి వివరించనున్నారు
➢ వర్షాల నష్టంతో పాటు ఇతర పట్టణాల్లో చేపట్టనున్న పలు మౌళిక వసతులు ప్రాజెక్టుల కోసం కేంద్ర సాయాన్ని కోరనున్న మంత్రి

➢ తెలంగాణకు అమృత్ ప్రాజెక్టులో భాగంగా కింద 10.73 కోట్ల ప్రోత్సాహక నిధులు

➢ ప్రాజెక్టు గైడ్స్ లైన్స్ అమలులో క్రీయాశీలకంగా పనిచేసినందుకు తెలంగాణకు ఈ ప్రోత్సహాక నిధులు  

➢ 30న ప్రధాని పాల్గోననున్న ఇండో –సాన్ 2016 ( స్వచ్ఛభారత్ సదస్సు)లో పాల్గోననున్న మంత్రి కెటియార్

 

రాష్ర్టంలోని పురపాలికలకు ప్రత్యేకంగా నిధులు కోరేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు రేపు డీల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం కేంద్ర పురపాలక శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో తెలంగాణ మున్సిపల్ శాఖ తరపున పలు అంశాలపైన చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ మద్య కురిసిన భారీ వర్షాల వలన తెలంగాణలోని పురపాలికల్లో జరిగిన నష్టాన్ని మంత్రి వివరించనున్నారు. వర్షాల వల్ల జియచ్ యంసితోపాటు ఇతర పురపాలికల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, ఒక నివేధిక సిద్దం చేయాలని మంత్రి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంజి గోపాల్ ను అదేశించారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ వివిధ పురపాలికల నుండి సమాచారం సేకరిస్తున్నది. వర్షాల నష్టంతో పాటు ఇతర పట్టణాల్లో చేపట్టనున్న పలు మౌళిక వసతులు ప్రాజెక్టుల కోసం కేంద్ర సాయాన్ని మంత్రి కెటియార్ కోరనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, ఇందుకోసం అవసరమైన నిధులు, కేంద్ర సాయం వంటి అంశాలతో కూడిన ఒక నివేధికను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు అందజేస్తారు.
దీంతోపాటు తెలంగాణకు అమృత్ ప్రాజెక్టులో భాగంగా కింద 10.73 కోట్ల ప్రోత్సాహ నిధులివ్వనున్నది. ఈ ప్రాజెక్టు గైడ్స్ లైన్స్ అమలులో క్రీయాశీలకంగా పనిచేసినందుకు తెలంగాణకు ఈ ప్రోత్సహాక నిధులు లభించనున్నారు. తెలంగాణలో మెత్తం 12 అమృత్ పట్టణాలను కేంద్ర గుర్తించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సెల్ప్ అసెస్ మెంట్ రిపోర్టను కేంద్రం క్షుణ్ణంగా పరీశీలన చేసిన తర్వాతా ఈ ప్రోత్సాహకం ఇస్తున్నట్లు మంత్రికి రాసిన లేఖలో పెర్కోన్నది. ఈ నెల 30న ప్రధాని పాల్గోననున్న ఇండో –సాన్ 2016 ( స్వచ్ఛభారత్ సదస్సు)లో పాల్గోనాల్సిందిగా మంత్రి కెటియార్ కు కేంద్ర అహ్వనం పంపింది. ఈ సదస్సులోనే ప్రోత్సహక నిధుల పత్రాలను అందజేయనున్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail