Browse By

బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు

ఈ నెల 30వ తేదీ నుండి అక్టోబరు 9 వ తేదీ వరకు నిర్వహించే బ్రతుకమ్మ పండుగకు ఘనంగా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు.


శనివారం సచివాలయం లో బతుకమ్మ పండుగ నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశములో ఆయన మాట్లాడుతూ, పండుగ నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా రు. 15 కోట్లు ప్రభుత్వం కేటాయించినదని, అన్ని శాఖలు సమన్వయముతో పనిచేసి, తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా ఉత్సవాలను నిర్వహిచాలని అన్నారు.

 

ఉత్సవాలలో భాగంగా వచ్చే అక్టోబర్ 6 వ తేదీన కేరళ రాష్ట్రంలో జరిగే ‘ఓనం’ పండుగ మాదిరిగా, 6,000 మంది మహిళలతో పెద్ద ఎత్తున ఎల్.బి. స్టేడియంలో బతుకమ్మ పాటలతో, “బతుకమ్మ పండుగ ఉత్సవం” నిర్వహించాలని అన్నారు. అక్టోబర్ 9 తేదిన G.H.M.C. పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలతో బతుకమ్మలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అయన అధికారులను ఆదేశించారు. బతుకమ్మల నిమజ్జనం సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జనం సందర్భంగా తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్లు మరమ్మతులు, మంచినీటి సౌకర్యం వంటి పనులు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రమైన ట్రాఫిక్ ప్రణాళికలు రుపొందిoచాలని నగర పొలిసు కమిషనర్ ను ఆదేశించారు. రాష్ట్ర్త స్థాయిలో నిర్వహించే విధంగా జిల్లాలలో కూడా బతుకమ్మ పండుగను నిర్వహించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని అయన అధికారులను ఆదేశించారు.

 
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. రమణాచారి మాట్లాడుతూ, గత సంవత్సరం నిర్వహించిన బతుకమ్మ పండుగ ఉత్సవాల కంటే ఈ సారి వినూత్నంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని అన్నారు. గత సoవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా ప్రతి రెస్టారెంటు వద్ద బతుకమ్మలతో అలంకరించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని, సమావేశానికి హాజరైన స్టేట్ హోటల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులను కోరారు.  

ఈ సమావేశంలో రాష్ట్ర డి.జి.పి. శ్రీ అనురాగ్ శర్మ, తెలంగాణా పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ & శిల్పారామం ప్రత్యెక అధికారి శ్రీ ఆర్. కిషన్ రావు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బి. వెంకటేశం, హైదరాబాదు జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ రఘునందన్ రావు, హెచ్.ఎం.డి.ఏ. కమిషనర్ శ్రీ చిరంజీవులు, నగర పొలిసు కమిషనర్ శ్రీ మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అధారిటి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దినకర్ బాబు, స్టేట్ ఆర్ట్ గ్యాలరి డైరెక్టర్ డా. లక్ష్మి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ హరిక్రిష్ణ, జి.హెచ్.ఎం.సి. మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail