Browse By

జైట్లీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కేటీఆర్

‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ తెలంగాణకు లభించింది.

న్యూఢిల్లీ: ఈ ఏడాదికిగాను ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ తెలంగాణకు లభించింది. ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్‌లో భాగంగా సీఎన్‌బీసీ-టీవీ 18 ఏటా ఈ పురస్కారం ఇస్తోంది. మంగళవారమిక్కడ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా మంత్రి కె.తారకరామారావు ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ అవార్డు సీఎం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనమని చెప్పారు. భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా అవతరిస్తుందని పేర్కొన్నారు.

దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని కేసీఆర్ చెబుతుంటారన్నారు. ఇంత మంది కేంద్ర మంత్రుల సమక్షంలో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవార్డుకు తెలంగాణను ఎంపిక చేసిన సీఎన్‌బీసీ-టీవీ 18కు ధన్యవాదాలు తెలిపారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail