Browse By

గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా 34,600 రేప్‌ కేసులు

కామాంధుల కోరల్లో చిక్కుకున్న వారిలో ఆరేళ్ల పాప నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకు ఉన్నారు

దేశంలో మహిళలపై దాడులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా 34,600 రేప్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధిక లైంగిక దాడులతో రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌ ముందు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది. . 2015లో మొత్తంగా 34,651 రేప్‌ కేసులు నమోదవ్వగా, అందులో 33,098 కేసుల్లో అత్యాచారానికి పాల్పడ్డవాళ్లు బాధితురాలికి తెలిసినవారే కావడం గమనార్హం.


4,391 రేప్‌ కేసులో మధ్యప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉండగా, 2,199 రేప్‌ కేసులతో దేశ రాజధాని కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాల విషయంలో మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గత సంవత్సరం మహిళలపై 3.27 లక్షల నేరాలు జరుగగా, అందులో 1.3 లక్షల కేసులు లైంగిక నేరాలకు సంబంధించినవే. రేప్‌ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర (4,144), రాజస్థాన్‌ (3,644), ఉత్తరప్రదేశ్ (3,025) ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 1027 రేప్‌ కేసులు నమోదవ్వగా, తెలంగాణలో 1105 లైంగిక దాడులు జరిగాయి.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail