Browse By

ఐటి శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి కెటి రామారావు

ఐటి శాఖపైన మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. టియస్ ఐఐసి కార్యాలయంలో జరిగిన ఈ సమావేవంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు ఐటి శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు. తెలంగాణ పైబర్ గ్రిడ్, సాప్ట్ నెట్ కార్యక్రమాలపైన మంత్రి సమీక్షించారు. పైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్న తీరుని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్ డబ్యూయస్ శాఖ అద్యర్యంలో నడుస్తున్న మిషన్ భగీరథ పనులతో సమన్వయంగా జరుగుతున్న విధానాన్ని సమీక్షించారు. అగస్టు రెండో తేదిన అన్ని మిషన్ భగీరథ వర్కింగ్ ఏజెన్సీలతో ఓక ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి మిషన్ భగీరథ పనులతో పాటు ఫైబర్ గ్రిడ్ పనులను సమాంతరంగా చేయాలని కోరనున్నారు. ఫైబర్ గ్రిడ్ లో ఉపయోగించే పరికరాలను మంత్రి పరిశీలించారు. ఐటి శాఖ ఏలక్ర్టానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి పరికరాల గురించి వివరించారు. మిషన్ భగీరథ పైపులైన్లో వేసే మేజర్ ఫైబర్ అప్టిక్ వైర్లతో గ్రామాల్లో ఇంటింటికి కనెక్షన్ ఇచ్చే వైర్లను, వాటి వివరాలను మంత్రి విరించారు. ఇప్పటికే పైబర్ గ్రిడ్ పైన అనేక కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయని, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రతి ఓక్కరికి డిజిటల్ ప్రపంచ ప్రయోజనాలు అందుతాయన్నారు మంత్రి కెటియార్. 
సాప్ట్ నెట్ సియివో శైలేష్ రెడ్డి సంస్ధపైన( మనటివి) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సాప్ట్ నెట్ పేరు మార్చాలని, త్వరలోనే పున: ప్రారంభానికి ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. గతంలో చెప్పిన తీరుగా ఈ చానల్ తో యువతకు, విద్యార్దులకు, రైతులకు, గృహిణులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలను తయారు చేసుకోవాలని కోరారు. టాస్క్, టిహబ్ లాగానే సాప్ట్ నెట్ కు పూర్తి స్ధాయిలో శాఖ పరమైన సహాకారం అందించేలా చూస్తామని మంత్రి తెలిపారు.    
ఈ సమావేశంలో సాప్ట్ నెట్, పైబర్ గ్రిడ్ అధికారులు పాల్గోన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail