Browse By

కంగారూలపై గెలిచిన లంకేయులు

పల్లెకెలె: సొంతగడ్డపై లంకేయులు తిరుగులేని ప్రదర్శనతో కంగారూలను మట్టికరిపించారు. పల్లెకెలె వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టులో 268 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను 161 పరుగులకే కుప్పకూల్చి 106 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయాన్ని అందుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 83/3తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (55) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్‌ హెరాత్‌ (5/54) కంగారూల పతనంలో కీలక పాత్ర పోషించాడు. అంతక ముందు తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే ఆలౌటై నిరాశపరిచిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కుశాల్‌ మెండిస్‌ (176) శతకం బాదడంతో 353 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులు చేసి 86 పరుగుల ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శ్రీలంక స్పిన్నర్ల ధాటికి నిలవలేక చేతులెత్తేసింది. దీంతో 17ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియాపై శ్రీలంక నెగ్గినట్లైయింది. మరోపక్క టెస్టుల్లో సారథిగా తొలి పరాజయాన్ని స్టీవ్‌ స్మిత్‌ చవిచూశాడు. రెండో టెస్టు ఆగస్టు 4 నుంచి జరగనుంది.
స్కోరు వివరాలు
శ్రీలంక 117, 353
ఆస్ట్రేలియా 203, 161

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail