Browse By

ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

ఘట్‌కేసర్‌: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌లో నివాసం ఉండే సత్యనారాయణ ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ హౌసింగ్‌బోర్డు కార్యాలయంలో డీఈగా పని చేస్తున్నారు. సత్యనారాయణ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తుండగా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌ వద్ద రైలు పట్టాలపై భార్య మీరాబాయి(45) కుమార్తెలు స్వాతి(31), నీలిమ(29), కుమారుడు శివరామకృష్ణ(22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సత్యనారాయణ(53) వీరు ప్రయాణించిన కారులోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. సత్యనారాయణ పురుగుల మందు తాగాడా లేక గుండపోటుతో మృతి చెందాడ అనే విషయం అనుమానంగా ఉందని పోలీసులు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఘట్‌కేసర్‌ పోలీసులు కారులో మృతదేహన్ని గుర్తించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి ఘటకేసర్‌, సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సత్యనారాయణ కుటుంబం ఆత్మహత్యకు ఆర్థిక, అనారోగ్య సమస్యలే కారణమై ఉంటాయని సీఐ ప్రకాశ్‌ తెలిపారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail